12 July, 2026 | 6:13 PM

Breaking News

సింగరేణి మెయిన్ హాస్పిటల్‌లో హెల్త్ క్యాంప్   •   తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు టీఆర్ఎస్ ఆవిర్భావం   •   ఖేలో ఇండియా ఖోఖో సెంటర్ ను సందర్శించిన డివైఎస్ఓ సురేష్   •   వాహనదారులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ పేపర్లు, లైసెన్సులు కలిగి ఉండాలి   •   జాడ లేని వానలు... ఎండుతున్న పంటలు..   •   కన్నెపెళ్లి పంప్ హౌస్ మోటార్లను వెంటనే ఆన్ చేయాలి   •   ఎమ్మార్పీఎస్ కరపత్రాలు ఆవిష్కరణ   •   సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రజా పాలన ప్రభుత్వ లక్ష్యం   •   పీఎఫ్ ఉన్న ప్రతి బీడీ కార్మికురాలికి ప్రభుత్వం పెన్షన్ అందజేయాలి   •   పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవంలో ప్రభుత్వ విప్ విజయరమణరావు   •  

పార్లమెంట్ చరిత్రలో ఎన్నడూ ఇలా జరగలేదు

05-02-2026 04:13 PM

లోక్‌సభకు రావద్దని ప్రధానికి సూచించా: స్పీకర్

న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న పార్లమెంట్ లో ఘటన దురదృష్టకరమని స్పీకర్ ఓం బిర్లా(Lok Sabha Speaker Om Birla) అన్నారు. కాంగ్రెస్ మహిళా ఎంపీల ప్రవర్తనను స్పీకర్ ఖండించారు. పార్లమెంటులో ప్రధానిపై దాడికి ప్రయత్నించారని స్పీకర్ వెల్లడించారు. పార్లమెంట్ చరిత్రలో ఎన్నడూ ఇలా జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానిని ఘెరావ్ చేయడం పట్ల విపక్షాల తీరును స్పీకర్ తప్పుబట్టారు. కాంగ్రెస్ మహిళా ఎంపీలు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారని స్పీకర్ ఆరోపించారు.

విపక్ష ఎంపీలు సభా మర్యాదలను ఉల్లంఘించారని స్పీకర్ మండిపడ్డారు. విపక్షాల నిరసనల దృష్ట్యా లోక్ సభకు రావద్దని ప్రధానికి సూచించినట్లు స్పీకర్ స్పష్టం చేశారు. సభను వాయిదా వేయడానికి ముందు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈరోజు మాట్లాడుతూ, "నిన్న సభలో ఏం జరిగిందో దేశం చూసింది. ఎంపీలు సభలో ప్రధాని కుర్చీ వద్దకు ఎలా వెళ్లారో అందరూ చూశారు. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరగవచ్చని నాకు సమాచారం అందింది. అలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు, ప్రధాని మోదీని సభకు రావద్దని నేను ఆయనకు తెలియజేశాను." అని ఓం బిర్లా పేర్కొన్నారు.