05-02-2026 12:15:12 PM
హైదరాబాద్: గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం(Central Government) శుభవార్త చెప్పింది. కేంద్రం పంచాయతీలకు( Gram Panchayat) 15వ ఆర్థిక సంఘం నిధులు(15th Finance Commission) విడుదల చేసింది. తొలి విడతగా రూ. 259.36 కోట్లు విడుదల చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పూర్తికావడంతో నిధులు విడుదల చేస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. తెలంగాణ రాష్ట్రానికి సుమారు రూ. 3 వేల కోట్లకు పైగా నిధులు రావాల్సి ఉందని ప్రభుత్వం తెలిపింది.