calender_icon.png 18 February, 2026 | 2:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లాంగ్ లీవ్ కేసీఆర్

17-02-2026 10:19:08 PM

- కాంగ్రెస్కు ప్రత్యుమ్న్యాయం బీఆర్ఎస్ పార్టీనే పట్లోల్ల కార్తీక్ రెడ్డి

- ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణిచేసి కేక్ కట్ చేసిన బిఆర్ఎస్ శ్రేణులు

చేవెళ్ల,(విజయక్రాంతి): ఉద్యమ నేత రాష్ట్ర మాజీ సీఎం కెసిఆర్ 72వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంలో బిఆర్ఎస్ మండలం పార్టీ నాయకులు పెద్దొళ్ళ ప్రభాకర్ అధ్యక్షతన మాజీ డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బర్త్డే వేడుకల్లో ఆ పార్టీ యువ నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్ కండువా కప్పుకుని పార్టీ కిందా 10యేండ్లు పదవులు అనుభవించిన నాయకులు మాజీ ఎంపి గడ్డం రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య మరికొంతమంది పార్టీ మారారన్నారు.

జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ కార్యకర్తల నాయకత్వపోరాటం వీరోచితమైందని పులులు సింహాల గర్జించారన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ పార్టీనే ఉంటుందని చెప్పారు. ఏ ఎన్నికలు వచ్చినా కార్యకర్తల తరఫున ఇదే మాదిరిగా వీరోచితంగా పోరాడుతామని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించి బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తామని దీమా వ్యక్తం చేశారు. కెసిఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నమన్నారు. లాంగ్ లీవ్ కెసిఆర్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. అయితే కార్యకర్తలు నాయకులు క్రమశిక్షణ తప్పి కార్తీక్ రెడ్డి తో ఫోటోలో కనిపించాలని ఒకరినొకరు నెట్టుకున్నారు.

ఇది చూశాక నాయకత్వం లోపభూరిష్టంగా ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యమ నాయకుడు దేశమొల్ల ఆంజనేయులు, మాజీ ఎంపిపి మల్గారి విజయభాస్కర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మిట్ట రంగారెడ్డి, గోనె కర్ణాకర్ రెడ్డి, వార్డు సభ్యులు కుర్వ మల్లేష్, 5వ వార్డు సభ్యులు దేవులపల్లి శ్రీనివాస్ రెడ్డి, మొదటి వార్డు సభ్యుడు దూత మల్లేష్, రెండవ వార్డు సభ్యడు డప్పు సువర్ణ చందు, నాయకుడు నత్తి కృష్ణా రెడ్డి, కనకమామిడి మల్లారెడ్డి, తలారి యాదయ్య, దండు సత్యం, ఎం.డి జాహెద్, బేగరి అనిల్, పెంజర్ల అనంత్ రెడ్డి, కరికే శ్రీనివాస్, వెంకటేష్,ఎదిరే రాములు, జైపాల్ రెడ్డి, అత్తేల్లి రాఘవేందర్ రెడ్డి, ఫయాజ్, ఎం. డి ఇమ్రాన్  తదితరులు పాల్గొన్నారు.