15 April, 2026 | 12:27 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

23 మంది విదేశీయుల అరెస్ట్

18-02-2026 12:00 AM
  1. టోలిచౌకిలో భారీ కార్డన్ సెర్చ్
  2. పారామౌంట్, ఐఏఎస్ కాలనీల్లో పోలీసుల సోదాలు

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలోని టోలిచౌకి పరిసర ప్రాంతాల్లో సోమవారం అర్ధరాత్రి గోల్కొండ జోన్ డీసీపీ జి. చంద్రమోహన్ నేతృత్వంలో పోలీసులు భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.

ఈ తనిఖీల్లో వీసా గడువు ముగిసినా, అక్రమంగా నగరంలో నివసిస్తున్న 23 మంది విదేశీయులను అదుపులోకి తీసుకోవడంతో పాటు భారీగా అక్రమ వస్తువులను స్వాధీ నం చేసుకున్నారు. టోలిచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలోని పారామౌంట్ కాలనీ గేట్ నం. 1 నుంచి 4, ఐఏఎస్ కాలనీ, హకీంపేట కుంట ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సుమారు 250 మంది పోలీ సు సిబ్బందితో కూడిన భారీ బందం ఈ ఆపరేషన్‌లో పాల్గొంది.

ఈ ఆపరేషన్‌లో ఫారిన్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అధికారుల సహాయంతో విదేశీయుల పాస్‌పోర్టులు, వీసాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన ధృవపత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. నివాస ప్రాంతాల్లో  అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ దందాను కూడా పోలీసులు రట్టు చేశారు.

ఈ క్రమంలో 9 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు అనుమతి లేకుండా నిల్వ ఉం చిన 53 మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. నగరంలో శాంతిభద్రతలకు విఘా తం కలిగించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని డీసీపీ చంద్రమోహన్ స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్‌లో స్థానిక ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.