calender_icon.png 9 June, 2025 | 9:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీకృష్ణా! మీతో ఉండడమే బంగారం!!

10-01-2025 12:00:00 AM

మణివణ్ణా అంటే కొంగుమణి అనీ భక్తులకు కొంగు బంగారమనీ అర్థం. మాలే మణివణ్ణా మాటద్వారా భగవంతుని ఆశ్రిత వాత్సల్యమనే సౌశీల్యంతోపాటు కొంగుమణిగా సులభంగా దొరికే సౌలభ్యమూ ప్రకటి తమైంది. నన్ను కావాలనుకున్న వారు పఱై (ఢక్కా వాద్యపరికరం) కావాలని ఎందుకు అడుగుతున్నారు? అవి ఎన్ని కావాలని శ్రీకృష్ణుడు గోపికలను అడిగాడు.

ఈ పఱై గానీ వ్ర తం గానీ, వర్షం కోసం వ్రతం చేయాలనడం కోసం కేవలం వ్యాజం మాత్రమే. నిన్ను చూడడమే ఈ వ్రతం లక్ష్యం. ఈ వ్రతానికి మార్గళి స్నానం అనుష్టానం అని పెద్దలు అంటున్నారు. నీతో సంశ్లేషమే స్నానం. పైకి పెద్దలకోసం చేసిన వ్రతానికి కావలసిన పరికరాలు, కాని ఆంతరముగా భగవదనుభూ తికి కావలసిన సామగ్రిని వారు అడుగుతున్నారు. శంఖాలు, పఱై వాయిద్యాలు, మం గళా శాసనం చేసేవారు, దీపాలు, కేతనాలు, గొడుగులు మొదలైనవి మాకు ఇమ్మని గోపికలు ప్రార్థిస్తున్నారు.

భక్తులను కాపాడే(మాలే) నీలమణివర్ణుడా(మణవణ్ణన్) ప్రళయకాలంలో మఱ్ఱి ఆకు మీద పవళించిన వాడా(ఆలిన్ ఇలైయాయ్) మార్గళి స్నానం చేయడానికి(మార్గళి నీరాడువాన్) పెద్దలు(మేలైయార్) చేసే అనుష్టా లకు(సేయ్ వనగళ్) కావలసిన ఉపకరణాలు(వేండువన) మీరు వింటే చెబుతాము (కేట్టియేల్) ప్రపంచమంతా(ఞాలత్తుఎల్లామ్) వణికేట్టు(నడుంగ) ధ్వని చేసే(మురల్వన్) పాలరంగును పోలిన(పాలన్న వణ్ణత్తున్).

నీ పాంచజన్యానికి తోడైన(ఉన్ పాంచచన్నియయే) శంఖాలను(శంగంగళ్) చాలా విశాలమైన(పోయ్ పాడు ఉడైయన) చాలా పెద్దవయిన(శాలపెరం) డక్కాలు(పఱై) తిరుపల్లాండు పాడేవారు(పల్లాండు ఇశైప్పార్) మంగళదీపాలను(కోలవిళక్కు), ధ్వజాలను(కొడి) మేలకట్లను(వితానం) మాకు అనుగ్ర హించండి(అరుళ్) మాలే అన్న పదప్రయోగం ద్వారా గోదాదేవి, గోపికలకు శ్రీకృ ష్ణుడిమీద ఉన్న ప్రేమకన్నా శ్రీకృష్ణుడికి వారిమీద ఉన్న ప్రేమ చాలా రెట్లు ఎక్కువ అని వివరిస్తున్నారు.

శ్రీరాముడి విశిష్ఠ లక్షణం శరణన్న వారిని రక్షించడమే. ఇన్ని రోజులు తమకు శ్రీకృష్ణుడంటే అమిత ప్రేమ అని గోపికలు అనుకున్నారట. కాని, ఆయన చల్లనిచూపుల్లో పొంగి పొర్లిన అనురాగాన్ని చూసి ఆయన భక్త వ్యామోహంతో పోల్చితే తమ వ్యామోహం సముద్రంలో నీటిబొట్టం త మాత్రమే అని తెలుసుకున్నారు. కనుక, ఆ యనను మాలే అని సంబోధిస్తారు.

శ్రీకృష్ణుడు నాలో ఆశ్రిత వాత్సల్యం ఉందని మీరు ఏ విధంగా తెలుసుకున్నారంటే, మణిదీపాల కాంతిదీపాలను దాటి దానంతటదే ప్రకాశించినట్టు మీ గుణం ప్రకాశిస్తున్నది మణివణ్ణా శ్రీ కృష్ణా అంటారు. మనసులలోని గుణం శరీరవర్ణంలో ప్రతిబింబిస్తున్నదట. మణివణ్ణా అంటే కొంగుమణి అనీ భక్తులకు కొంగుబంగారమనీ అర్థం. మాలే మణివణ్ణా అనే మాటద్వారా భగవంతుని ఆశ్రిత వాత్స ల్యం అనే సౌశీల్యంతోపాటు కొంగుమణిగా సులభంగా దొరికే సౌలభ్యమూ ప్రకటితమైం ది.

అది సరే మీరెందుకు వచ్చారు? అని ప్ర శ్నించాడు. శ్రీరాముడు శరణాగతవత్సలుడు, శ్రీకృష్ణుడు ఆశ్రిత వ్యామోహం కలవాడు. రాముడు రావణుడి తమ్ముడినైన నన్ను స్వీకరిస్తాడా అని విభీషణుడు అనుకుంటూ వస్తున్నాడట. కాని శ్రీరాముడేమో రావణుడే వస్తే బాగుంటుంది కదా.

పోనీ అతను కాకపోతే ఆయన తమ్ముడైనా వస్తే బాగుండు అనుకుంటాడట. మహాపరాక్రమశాలి యోధులం దరిలోకి మహాయోధుడైన శ్రీకృష్ణుడు తనను ఆశ్రయించిన పాండ వులకోసం దూతగా, సారథిగా చిన్నచిన్న ప నులు చేస్తాడట. పరమాత్మను పొందడానికి ఆళ్వార్లు పడే ప్రేమ తపన కన్నా ఆళ్వార్లను పొందడానికి పెరుమాళ్లు పడే తపన మరీ ఎక్కువట.