30 June, 2026 | 7:28 PM

సిగరెట్లు అక్రమంగా తరలిస్తున్న లారీ సీజ్

05-06-2025 01:08 AM

రూ. 20 లక్షలు విలువ చేసే సిగరెట్లు వాహనం సీజ్ 

నిజామాబాద్ జూన్4: (విజయ క్రాంతి): మహారాష్ట్ర నుండి సిగరెట్ల లోడుతో వస్తున్న అక్రమ రవణ ను పోలీసుల కు కట్టుబడింది. పొరుగు రాష్ట్రం మహారాష్ట్ర నుంచి నిజామాబాద్ నగరానికి అక్రమంగా తరలిస్తున్న సిగరెట్ల ను  పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం రాత్రి నగరంలోని మూడో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు.

ఈ క్రమంలో మహారాష్ట్ర నుంచి జీఎస్‌టీ చెల్లించకుండా అక్రమంగా నగరానికి తీసుకు వస్తున్న సిగరెట్లను పట్టుకున్నారు. వీటి విలువ సూమరు రూ.20 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. అనంతరం కమర్షియల్ ట్యాక్స్ శాఖ అధికారులకు అప్పగించారు. ఇది ఇలా ఉండగా నిజామాబాద్ నగరానికి చెందిన ఇద్దరు మార్వాడీ వ్యాపారులు మహారాష్ట్ర నుంచి తక్కువ రేట్లకు సిగరెట్లు తీసుకు వస్తున్నట్లు తెలిసింది. వీరు అక్కడి నుంచి తక్కువ ధరకు తెచ్చి ఇక్కడ ఎక్కువ రేటుకు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు.