30 June, 2026 | 8:39 PM

Breaking News

రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •   కబడ్డీ క్లబ్‌లు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాలి   •   నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి   •   ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఇన్‌చార్జిగా పస్క నర్సయ్య నియామకం   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   రోడ్డు ప్రమాదాల నివారణకు 3 డి రేడియం పోలీస్ వాహనాల ఏర్పాటు   •   రిటైర్డ్ పోలీసుల సేవలు మరువలేం   •   సింగరేణి అధికారుల పీఆర్పీ నిలుపుదలను వెంటనే ఎత్తివేయాలి: జనక్ ప్రసాద్ సంఘీభావం   •  

రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి

05-06-2025 01:08 AM
  1. బూర్గంపాడు తహసీల్దార్ శిరీష

గ్రామాల్లో ఈ నెల 13 వరకు రెవెన్యూ సదస్సులు

బూర్గంపాడు, జూన్ 4 (విజయక్రాంతి): భూభారతి చట్టంపై అవగాహన కల్పించడంలో భాగంగా ఏర్పాటు చేస్తున్న రెవెన్యూ సదస్సులను సంబంధిత రైతులు ,భూ సమస్యలు ఉన్నవారు సద్వినియోగం చేసుకో వాలని బూర్గంపాడు తహశీల్దార్ శిరీష  అ న్నారు. భూభారతి చట్టంపై అవగాహన కల్పించడంలో భాగంగా బుధవారం బూర్గంపాడు మండల పరిధిలోని ముసలిమడుగు గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం భూ సమస్యలు పరిష్కరించ డం కోసం ఆయా గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తునమ న్నారు. గతంలో అప్పటి తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి స్థానంలో మరింత ఆధునిక పద్ధతులతో సాంకేతికతను జోడించి సత్వర న్యా యం చేసే విధంగా కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని జూన్ 2న అమల్లోకి తీసుకువచ్చిందని, రెవెన్యూ సదస్సులు ఈ నెల 13 వరకు కొనసాగుతాయని ఆయా గ్రామాల్లో రెవెన్యూ సిబ్బంది సదస్సులు నిర్వహిస్తారని తెలిపారు.

ఎవరికైతే భూ రికార్డుల సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్క రించుకోవడం కోసం సదస్సులు ఉపయోగపడతాయన్నారు. భూభారతి చట్టం భూ యజమానులకు ఏ విధంగా మేలు చేస్తుం దో రెవెన్యూ సదస్సుల ద్వారా తెలియజేయ డం జరుగుతుందన్నారు. సదస్సులో భూ యజమానులు తమకు గల భూ సమస్యలను సదస్సు దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.