calender_icon.png 14 July, 2025 | 5:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో 17,287 టన్నుల బియ్యం పంపిణీ

05-06-2025 01:10:08 AM

జిల్లా పౌరసరఫరాల అధికారి రుక్మిణీదేవి 

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 4 (విజయక్రాంతి): ప్రభుత్వ ఆదేశానుసారం రాబోయే మూడు నెలల బియ్యం పంపిణీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రారంభించినట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రుక్మిణీదేవి తెలిపారు. బుధవారం ఆమె పలు చౌక డిపోలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఆదివారం నుంచి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు.

తెల్ల రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు అవసరమైన 17,287 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎం ఎల్ ఎస్ పాయింట్ నుంచి చౌక డిపోలకు దఫలవారీగా తరలించినట్లు తెలిపారు. ఈనెల 30వ తేదీ వరకు బియ్యం పంపిణీ జరుగుతుందని డీలర్లు సమయపాలన పాటించాలని ఆదేశించారు. జిల్లాలోని 443 చౌక దుకాణాల ద్వారా ఇప్పటివరకు 32,488 మంది లబ్ధిదారులకు బియ్యం పంపిణీ జరిగినట్లు తెలిపారు.