9 May, 2026 | 5:33 PM

Breaking News

వెంకటేశ్వర స్వామి ఆలయంలో రక్షణ ఏర్పాట్లు   •   అక్రమంగా ఎద్దులను తరలిస్తున్న కంటైనర్ వాహనాన్ని పట్టుకున్న పోలీసులు   •   పాత బిల్లుల పేరిట కొత్త పాలకవర్గంపై ఒత్తిడి?   •   కాకతీయ కళల జాతర సాంస్కృతిక పోటీలు ప్రారంభం   •   పేదల మెరుగైన జీవితం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం   •   తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది బిజెపి ప్రభుత్వమే   •   కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులను కలిసిన ఎర్ర విజయ్ రావు   •   సుల్తానాబాద్ లో జాతీయ పక్షి నెమలి మృతి   •   ధాన్యం కొనాలని ఇందారంలో రైతుల రాస్తారోకో   •   సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర   •  

తెలంగాణకి వర్ష సూచన.. నాలుగు రోజుల పాటు జోరు వానలు

30-08-2024 02:53 PM

హైదరాబాద్: బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణకి వర్ష సూచన ఉన్నట్లు భారత వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలో శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సెప్టెంబరు 3 వరకు రాష్ట్రంలో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ విడుదల చేసిన ఏడు రోజుల వాతావరణ బులెటిన్ సూచిస్తుంది. రేపు అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశముంది. నేడు తేలికపాటి నుంచి మోస్తరు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున పలు జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. శుక్రవారం ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాలు, జగిత్యాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు,  భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.