బీఆర్ఎస్ 109 కేసులు పెట్టింది... రెండు సార్లు జైలుకు పంపింది
హైదరాబాద్: నాగోల్ లో బీజేపీ సభ్యత్వ నమోదుపై మోర్చాలు, సెల్స్ సంయుక్త కార్యశాలన్న చేస్తున్నారు. ఈ కార్యశాలలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర పదాధికారులు, మోర్చా, సెల్స్ రాష్ట్ర, జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 3 నుంచి రాష్ట్రంలో చేపట్టే సభ్వత్వ నమోదుపై నేతలకు దిశానిర్ధేశ్యం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ... రైతు పంట రుణమాఫీపై రాష్ట్ర ప్రజల్లో చర్య జరుగుతోంది కాబట్టే హైడ్రా పేరుతో హైడ్రామా మొదలు పెట్టారని బండి సంజయ్ దుయ్యబట్టారు. ఓవైసీకి రాష్ట్ర ప్రభుత్వం భయపడిందని, కాంగ్రెస్, బీజేపీ ఒక్కటని బీఆర్ఎస్ ఆరోపిస్తోందన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటని కాంగ్రెస్ ఆరోపిస్తోందని, మొత్తానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ టార్గెట్ బీజేపీనే అని కేంద్ర మంత్రి ధ్వజమోత్తారు. ప్రతి కార్యకర్త ప్రజాప్రతినిధి కావాలనే లక్ష్యంతో పనిచేయాలని సూచించారు. బీజేపీ వల్లే కవితకు బెయిల్ వచ్చిందని కాంగ్రెస్ ఆరోపిస్తోందని బండి పేర్కొన్నారు. వ్యక్తులు, ప్రభుత్వాలు ఇచ్చే సూచనలతో కోర్టులు తీర్పులు, బెయిల్ ఇవ్వవని గుర్తుచేశారు. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ కలవడం పక్కా అని బండి సంజయ్ చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 109 కేసులు పెట్టింది... రెండు సార్లు జైలుకు కూడా పంపించిందని సభ ముఖంగా గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ కుటుంబాన్ని వదిలే ప్రసక్తే లేదన్నారు.






