9 May, 2026 | 6:46 PM

వేములవాడ ఆలయ విస్తరణ.. సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే, ఆలయ అధికారులు

30-08-2024 01:35 PM

హైదరాబాద్: వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌, వేములవాడ ఆలయ అర్చకులు, అధికారులతో కలిసి శుక్రవారం ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డిని కలిశారు. రాష్ట్ర బడ్జెట్‌లో ఆలయ విస్తరణకు రూ.50 కోట్లు కేటాయించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ముఖ్యమంత్రికి ఆశీస్సులు అందజేశారు. ఆలయ విస్తరణ కు సంబంధించిన డిజైన్స్, నమూనా కు శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాల్సి ఉందని ఆలయ అర్చకులు సీఎంకు తెలిపారు. ముఖ్యమంత్రి స్పందిస్తూ, శృంగేరి పీఠాన్ని సందర్శించి డిజైన్లకు అవసరమైన అనుమతులు పొందాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రిని కలిసిన ఆలయ ఈవో వినోద్, స్థపతి వల్లినాయగం, ఈఈ రాజేష్, డీఈఈ రఘునందన్, ఆలయ ప్రధాన అర్చకులు ఉమేష్ శర్మ, తదితరులు ఉన్నారు.