14 March, 2026 | 12:19 AM

లో వొల్టేజ్ సమస్యను పరిష్కరించాలి

13-03-2026 09:50 PM

- బి జె పి మండల పార్టీ అధ్యక్షుడు పింగళి విజయ్ రెడ్డి 

గుండాల,(విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం కేంద్రంలో స్థానిక సబ్ స్టేషన్ వద్ద రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు కాళి శీను ఆధ్వర్యంలో లో వో ల్టేజ్ సమస్యను పరిష్కరించాలని ఏ ఈ నరసింహ కు వినతిపత్రం అందజేసారు.లో వోల్టేజ్ సమస్య వలన మోటర్లు, స్టార్టర్లు కాలిపోవడం జరుగుతుంది. ఈ సమస్య రైతులకు చాలా ఇబ్బంది కరంగా ఉంది అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్  హామీని నెరవేర్చాలన్నారు. మండలంలో 132 కెవి సబ్ స్టేషన్ ను నిర్మించినట్లయితే లో  వోల్టేజ్ సమస్య ఉండదు అన్నారు .కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పింగళి విజయభాస్కర్ రెడ్డి, మండల వైస్ ప్రెసిడెంట్ వెంపటి సురేష్, ప్రధాన కార్యదర్శి కప్పరి నాగిరెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షుడు సింగారం సోమరాజు, నాయకులు సాయి తేజ, కిషోర్ మైపాల్ రెడ్డి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.