26 June, 2026 | 7:58 PM

టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా ఆరెపల్లి రాహుల్

26-06-2026 06:41 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరెపల్లి రాహుల్ ను టీపీసీసీ ఎస్సీ సెల్  డిపార్ట్మెంట్ రాష్ట్ర కార్యదర్శి గా ఎన్నికయ్యారు,  శుక్రవారం   నియామక పత్రాన్ని  డిపార్ట్మెంట్ రాష్ట్ర చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే  కవ్వంపల్లి సత్యనారాయణ అందజేయడం జరిగింది. ఈ నియామకానికి సహకరించిన రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి, మంత్రి శ్రీధర్ బాబుకి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణకి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణా రావుకి, రామగుండం ఎమ్మెల్యే  రాజ్ ఠాకూర్కి, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకి, కోర్డినేటర్ కొరివి అరుణ్ కుమార్ కు ఆరెపల్లి రాహుల్ కృతజ్ఞతలు తెలిపారు.