26 June, 2026 | 8:14 PM

ఓటరు జాబితా సవరణను... ఆదర్శవంతంగా తీర్చిదిద్దుదాం

26-06-2026 06:57 PM

జవహర్ నగర్ మాజీ మేయర్ మేకల కావ్య

జవహర్ నగర్,(విజయక్రాంతి): ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణను ఆదర్శవంతంగా తీర్చి దిద్దుదామని ఇందుకోసం ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు భాగస్వామిలవ్వాలని మాజీ మేయర్ మేకల కావ్య పిలుపునిచ్చారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ కేఎన్ఆర్ కాలనీలో ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని పురస్కరించుకొని శుక్రవారం బిఆర్ఎస్ పార్టీ బిఎల్ఎ లతో కలిసి మాజీ మేయర్ మేకల కావ్య పార్టీ అధ్యక్షుడు కొండల ముదిరాజ్ సమక్షంలో ఓటర్లను కలిసి అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా కావ్య మాట్లాడుతూ... పారదర్శకమైన ఓటరు జాబితాను రూపొందించేందుకు బిఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుందని ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన ప్రక్రియ అన్నారు. అర్హులైన ప్రతి పౌరుడి పేరును ఓటరు జాబితాలో నమోదు చేయడంతో పాటు ఉన్న మృతి చెందిన అనర్హుల పేర్లు తొలగించడం పొరపాట్లను సరిచేసి ఖచ్చితమైన ఓటరు జాబితాను సిద్ధం చేయడం ప్రధాన లక్ష్యం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ చారి, సింగన బాల్రాజ్ పటేల్, వెంకటేష్, సిద్ధులు యాదవ్, కృష్ణ యాదవ్, బీఎల్ఓ లు మహిళలు తదితరులు పాల్గొన్నారు.