నిర్మల్ పోలీస్... మీ పోలీస్...
పోలీస్ స్టేషన్లో తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా లక్ష్మణ్‌చందా పోలీస్ స్టేషన్‌ను జిల్లా పోలీసు అధికారి డా. జి. జానకి షర్మిల శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్‌లోని స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసులు, బెయిల్ కేసుల నిర్వహణ, రిసెప్షన్, మాల్ఖానా, ఆయుధాగారం, సీసీ కెమెరాల పనితీరు, సిబ్బంది హాజరు. నూతనంగా నిర్మిస్తున్న భవనాన్ని కూడా ఎస్పీ పరిశీలించారు. నిర్మాణ పనుల వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ చట్టప్రకారం సత్వరమే పరిష్కరించాలని, పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు.
ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని, మహిళలు, చిన్నారులు, వృద్ధుల ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదని ఎస్పీ స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని, సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించేలా పనిచేయాలని జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ సూచించారు.






