8 May, 2026 | 3:05 PM

Breaking News

ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన.. ఉర్దూ పోస్టర్‌ ఆవిష్కరణ   •   తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుతో ప్రాణహిత జలాలకు వినియోగం: మంత్రి జూపల్లి కృష్ణారావు   •   పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత   •   పుల్లాయిగూడెం నూతన రామాలయం ప్రారంభోత్సవం   •   కొడంగల్‌లో శ్రీవేంటేశ్వర స్వామి ఆలయానికి సీఎం భూమిపూజ   •   జూబ్లీహిల్స్‌లో రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య   •   ఎస్ పీఎల్ క్రికెట్ విజేతకు లక్ష నగదు, ట్రోఫీ అందజేత   •   రాస్తారోకో నిర్వహించిన బీఆర్ఎస్ శ్రేణులు   •   వేసవి శిబిరం సద్వినియోగం చేసుకోగలరు: ప్రిన్సిపాల్ నారాయణరెడ్డి   •   కొలనూరు చెరువు వద్ద రైతు వారోత్సవాలు నిర్వహణ   •  

నెలాఖరు వరకు ఎల్‌ఆర్‌ఎస్ గడువు పెంపు

18-06-2025 12:08 AM
  1. ఫీజులో 25 శాతం రాయితీ కొనసాగింపు
  2. ఉత్తర్వులు జారీ చేసిన మున్సిపల్‌శాఖ కార్యదర్శి ఇలంబర్తి

హైదరాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): స్థలాల క్రమబద్ధీకరణ స్కీం(ఎల్‌ఆర్‌ఎస్) గడువును రాష్ట్రప్రభుత్వం మరోసారి పెం చింది. తాజాగా ఉత్తర్వుల ప్రకారం భూయజమానులు ఈనె 30వ తేదీలోపు ఎల్‌ఎఆ ర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఇలం బర్తి ఉత్తర్వులు జారీ చేశారు. 25 శాతం రా యితీని కూడా పొందవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

గత ప్రభుత్వం స్థలాల క్రమబద్ధీకరణ కోసం ఎల్‌ఆర్‌ఎస్ స్కీంను అమలు చేసింది. దీంతో సుమారు 25 లక్షల మంది భూయజమానులు ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖా స్తు చేసుకున్నారు. ఇదే స్కీంను ప్రస్తుతం ప్రభుత్వమూ కొనసాగిస్తూ వస్తున్నది. తొలుత మార్చి నెలాఖరు వరకూ గడువు ఇచ్చి, ఆ తర్వాత నెలనెలా గడువు పెంచుకుంటూ వస్తున్నది.

కడపటి ఉత్తర్వు ప్రకారం.. మే 31 వరకే దరఖాస్తు గడువు ఉంది. ఎక్కువ మంది ప్రజలు స్కీంను సద్వినియోగం చేసుకునే వెసులుబాటు కల్పించేందుకు.. తాజా గా సర్కార్ మరోసారి గడువు పెంచింది. స్కీం ప్రారంభించిన నాటి నుంచి ఎల్‌ఆర్‌ఎ స్ ద్వారా సర్కార్‌కు రూ.2వేల కోట్ల మేర ఆదాయం లభించింది. గడువు పెంపుతో మ రో రూ.10వేల కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా.