అదృష్టం కూడా కలిసి రావాలి
23-08-2024 12:11 AM
ముంబై: విజయానికి జట్టు కృషి తో పాటు అదృష్టం కూడా కలిసిరావాలని భారత మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. టీ20 ప్రపంచకప్ గెలిచి న అనంతరం ద్రవిడ్ కోచ్‌గా తన పదవీకాలాన్ని ముగించాడు. బుధవారం సియట్ ‘జీవితకాల సాఫల్య పురస్కారం’ ద్రవిడ్‌కు లభించింది. ‘2023 వన్డే వరల్డ్‌కప్‌లో అప్పటి వర కు ఓటమన్నదే లేకుండా ఆడిన రోహిత్ సేన తుది మెట్టుపై బోల్తాపడింది. కానీ ఆరు నెలల తర్వాత అదే రోహిత్ సారధ్యంలోని భారత్ టీ20 ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి విశ్వవిజేతగా నిలిచింది’ అని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు. కాగా సియట్ అంతర్జాతీయ ఉత్తమ క్రికెటర్‌గా రోహిత్.. ఉత్తమ వన్డే బ్యాటర్ అవార్డు కోహ్లీ దక్కించుకున్నారు.






