25 March, 2026 | 7:49 AM

ప్రజ్ఞాతో డ్రా చేసుకున్న గుకేశ్

23-08-2024 12:15 AM

సెయింట్ లూయిస్: సిన్‌క్యూఫీల్డ్ కప్‌లో గురువారం భారత గ్రాండ్‌మాస్టర్లు గుకేశ్, ప్రజ్ఞానంద మధ్య జరిగిన మూడో గేమ్ డ్రాగా ముగిసింది. గేమ్‌లో ప్రజ్ఞా పూర్తి ఆధిపత్యం చెలాయించగా.. నల్లపావులతో ఆడిన గుకేశ్ 18 ఎత్తుల్లో కష్టపడి డ్రా చేసుకున్నాడు. 10 మంది ప్లేయర్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో మరో ఆరు రౌండ్లు మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం అలిరెజా, నెపొమినాట్చి రెండేసి పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ప్రజ్ఞానంద, గుకేశ్‌తో పాటు లాగ్రేవ్, కరూనా, వెస్లీ, లిరెన్‌లు తలా 1.5 పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో కొనసాగుతున్నారు.