12 May, 2026 | 2:06 AM

క్వార్టర్స్‌లో అంకిత

23-08-2024 12:08 AM

మాడ్రిడ్: భారత టెన్నిస్ స్టార్ అంకితా రైనా డబ్ల్యూ80 మాడ్రిడ్ 33ఎ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు దూసు కెళ్లింది. గురువారం మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ అంకిత 6 6 కెనడాకు చెందిన కాండీస్ బ్రేస్‌ను సునాయాసంగా ఓడించింది. గంటపాటు సాగిన మ్యాచ్‌లో అంకిత 5 బ్రేక్ పాయింట్లతో పాటు 31 విన్నర్లు సంధించింది. సున్నా ఏస్‌లకు పరిమితమైన బ్రేస్ 25 విన్నర్లు మాత్రమే కొట్టగలిగింది. అంతకముందు మహిళల డబుల్స్‌లో అంకిత షిండే  జోడీ ముర్ఫీ జంట చేతిలో ఓటమి చవిచూసి క్వార్టర్స్‌కు పరిమితమైంది.