17-07-2024 01:14:09 AM
‘డబుల్ ఇస్మార్ట్’తో డబుల్ వినోదాన్ని ప్రేక్షకులకు అందించేందుకు సన్నద్ధమవుతున్నారు పూరి జగన్నాథ్. రామ్ కథానాయకుడిగా ఆయన తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వచ్చే నెల 15న తెరమీదికి రానున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు టీజర్, పాటలతో ప్రచార కార్యక్ర మాలకు తెరలేపిన పూరి కనెక్ట్స్ టీమ్, తాజాగా ‘మార్ ముంత చోడ్ చింత’ అంటూ ఓ పాటని విడుదల చేశారు. కొద్ది రోజుల క్రితం విడుదలైన ‘స్టెప్పామార్’ పాటకి అభిమానులు స్టెప్పులేస్తుండగానే మరో డాన్స్ సాంగ్‌ని వారికందించారు ‘ఇస్మార్ట్’ బృందం. మణిశర్మ అందించిన ఈ మాస్ బీట్‌కి విజయ్ పోలాకి సమకూర్చిన డ్యాన్సులతో చెలరేగిపోయారు రామ్, కావ్య థాపర్. హైదరాబాదీ యాసతో కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటని రాహుల్ సిప్లిగంజ్, ధనుంజన్ సీపాన, కీర్తన శర్మ కలిసి పాడారు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌లో పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ సినిమాలో సంజయ్ దత్ ముఖ్య పాత్రలో సందడి చేయనున్నారు.