17-07-2024 02:23:51 AM
‘బచ్చలమల్లి’ కోసం మాస్ అవతారం ఎత్తారు కథానాయకుడు నరేశ్. కొద్ది రోజుల క్రితం విడుదలైన టీజర్ ద్వారా గ్రామీణ నేపథ్యంలో రానున్న ఈ సినిమాలో ఆయన ఎంత నాటుగా కనపడనున్నారో తెలుస్తోంది. ఇలాంటి వ్యక్తి ఓ అమ్మాయి ప్రేమలో పడితే, దానిని ఆ అమ్మాయికి ఎలా వ్యక్తపరుస్తాడు..? వ్యక్త పరచడం మాట అలా ఉంచితే.. అసలు ఆమెకి ఏం కావాలన్నది ఎలా తెలుసుకుంటాడు? ఈ నేపథ్యంలోనే ‘బచ్చలమల్లి’ చిత్రం నుంచి ఓ పాట తాజాగా విడుదలైంది.
ప్రేమికుడిగా నీకోసం ఏదైనా చేస్తా అని కథానాయకుడు అంటుంటే, ‘అర్ధభాగం ఇచ్చాక అంతకంటే కానుకే లేదుగా?’ అని అసలు విషయాన్ని అర్థమయ్యేలా చెప్పుకొచ్చింది కథానాయకి అమృత అయ్యర్. విశాల్ చంద్రశేఖర్ బాణీకి శ్రీమణి రాసిన ఈ గీతాన్ని సింధూరి విశాల్‌తో కలిసి మరో స్వరకర్త అయిన హరిగౌర ఆలపించారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేశ్ దండా, బాలాజీ గుత్త నిర్మిస్తున్న ఈ సినిమాకి సుబ్బు మంగదేవి దర్శకుడు. రోహిణి, రావు రమేశ్, అచ్యుత్ కుమార్, హరితేజ తదితరులు నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబరులో విడుదల కానుంది.