అనగనగా ఓ డిటి.. రక్త దానం
మహబూబాద్ జిల్లా గూడూరు మండలం కొత్త గూడ అటవీ ప్రాంతం.1999 లో నేను మానుకోట కు డి టి గా పని చేస్తున్నపుడు.. ఓ రైస్ మిల్లు ఇన్స్పెక్షన్ కోసం సాయంత్రం 4 గంటలకు నా టూ వీలర్ పై వెళ్తున్న.. సరిగ్గా 5 గంటల ప్రాంతం లో కొత్త గూడ అటవీ ప్రాంతంలో ఉన్న ముసలవ్వ గుడి దేవాలయం సమీపానికి చేరుకుంటా..అనగా..అక్కడికి సమీపం లో ఓ వ్యక్తి రోడ్డు పై పడి ఉన్నాడు. ఆ పరిసరాల్లో ఎక్కడా మనుష్య సంచారమే లేదు.ఎవరైనా అతన్ని ఇక్కడ వదిలి వెళ్ళారా.?! అని అనుమానించడానికి. ఓ వైపు 6 గంటలకల్లా.. రైస్ మిల్లు కు వస్తా అని చెప్పాను.ఇక్కడ కళ్లెదుట ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో..అపస్మారక స్థితిలో. . ఉన్నాడో..పోయాడో తెలియదు.చుట్టూ..దట్టమైన అడవి. ఏమ్ చేయాలో తోచని పరిస్థితి. ఆ వ్యక్తి కి సాయం చేద్దాం అంటే..నా ప్రాణం ను నేను పణంగా పెట్టి రిస్క్ తీసుకోవడమే.. ఎందుకంటే.. ఏ పొద చాటు నుంచి ఏ క్రూర మృగం వచ్చి ..నా ప్రాణం తీస్తుందో తెలియదు.
ఆలస్యం చేస్తే..ఎదురుగా..ఆపద లో ఉన్న వ్యక్తిని కాపాడగలిగే సమయం మించి పోతుంది. ఎన్ని గంటలనుంచి ఇలా పడి ఉన్నాడో తెలియదు.ఫోన్ లో సిగ్నల్ ఒక్క పాయింట్ ఉంది.
వెంటనే గూడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కు. ఫోన్ చేశా ..పరిస్థితి వివరించా..
సార్ అరగంట లో పి హెచ్ సీ మూసేస్తాము.ఈ లోపు వస్తె మంచిది.ఆలస్యం ఐతే మేము కూడా ఏమి చేయలేము సార్.అంటూ ఫోన్ పెట్టేసింది. తక్షణ కర్తవ్యం ఏంటి అని ఆలోచించా..
తీవ్రమైన చలి నుండి నన్ను నేను కాపాడుకోవడానికి నా చెవులకు కట్టుకున్న హ్యాండ్ కర్చీఫ్ తీసి..రెండు ముక్కలుగా చింపేసా..అతనికి ఉన్న గాయాలకు రెండు చోట్ల కట్టు కట్టా..
నా వెంట ఉన్న నీళ్ళు..కొన్ని అతని ముఖం పై చిలకరించా..కాస్త తేరుకున్నాడు. నోట్లో నుచి సన్నగా ఏదో శబ్దం.వస్తుంటే.. నోటికి దగ్గరగా చెవి పెట్టాను. దూప.. దాహం.. నీళ్లు..అంటున్నాడు.నా వద్ద ఉన్న నీళ్లు కొన్ని తాగించాను.(సార్ నీళ్లు ఎక్కువ తాగించద్దు) అని ఎప్పుడెప్పు..డో ఓ డాక్టర్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి.
గూడూరు కు వెళ్ళడానికి ఇంకా 20 నిముషాలే ఉన్నాయి.అతన్ని నా బండి పై కూర్చో బెట్టడానికి సాయం గా ఎవరైనా వస్తారేమో అని ఆశా గా ఓ 5 నిమిషాలు చూశా.. ఎవరూ.. రాలా..నేను తోడుకున్న చొక్కా విప్పి..అతని నా వెనక వీపు పై తీసుకుని అలాగే బండి పై కూర్చుని.. అతను బండి పై నుంచి పడిపోకుండా చొక్కా ను గట్టిగా కట్టేసా..వెలుగు తగ్గి చీకటి ముదురుతోంది బండి స్టార్ట్ చేసి.. వాచ్ చూసుకున్నా..15 నిమిషాలే ఉంది..క్లినిక్ కట్టేయడానికి.బండి ఎలా నడిపానో నాకే గుర్తులేదు.
సార్.. ఒక్క నిమిషం లెట్ అయితే వెళ్లి పోయే వాళ్ళం అంటూ.. పి హెచ్ సీ బయటే స్ట్రెచర్ తో సిద్ధం గా ఉంది నర్స్.
ఏమైంది సార్ అతనికి అనడిగితే..ముందు బ్లడ్ ఎక్కించండి అతనికి రక్తం ఎంత పోయిందో తెలియదు అని చెప్పాను. అతనిది ఏ బ్లడ్ గ్రూపు తెలియదు.మన వద్ద ఆ బ్లడ్ లేకపోతే మైబ్బాద్ కో..నర్సంపేట కో తీస్కపోవాలి అని చెప్తూనే నర్స్ స్టేచర్ ను లోపలికి తీసుకెళ్లింది.ఉండండి సార్ మీ బ్లడ్ చెక్ చేస్తా అంటూ..
నాది బి పాజిటివ్. ఒక వేళ అతనిది నాది సేమ్ ఐతే..నా రక్తం తీసుకోండి అని చెప్పాను.
మనం లక్కీ సార్..ఇతనిది, మీది సేమ్ బ్లడ్ గ్రూప్ అని కాస్త సంతోషం గా చెప్పింది.
అతని ప్రాణాలు ఎలాగైనా కాపాడాలి మేడం అంటూ..కాస్త అమౌంట్ ఆమె కు ఇచ్చే ప్రయత్నం చేశా.. సార్..
ఏమైనా ఖర్చు అయ్యేది ఉంటే..
నేనె మీకు చెప్తా..మీ వద్దే ఉంచండి అన్నది.
250 మి లీ రక్తం దానం చేసి..
అతను కోలుకున్నాక నాకు కబురు చేయండి.అని చెప్పి, మహబూబాబాద్ కు వచ్చేశా.
ఇంకా..తెల్లవారనేలేదు.నా ఫోన్ మోగింది.
సార్ నా పేరు ఐలయ్య సార్. నిన్న కొత్తగూడ అడవి లో దున్న గుద్దితే పడి పోయింది నేనే సార్.
ఎవరో ఎన్ఫోర్స్మెంట్ డిటీ అట,ఆయన నిన్ను తెచ్చేపటికే నువ్వు బతికినవు.లేక పోతే పోయేటోడివే అని నర్సమ్మ చెప్పింది సారూ ..మిమ్మల్ని కల్వాలే సారూ..
అంటూ..ఏడ్వవట్టిండు.సరే సరే నేనే వస్తా క్లినిక్ కి అని చెప్పి లంచ్ టైం వరకు పి హెచ్ సీ కి వెళ్ళా..
సార్ మీరు తెచ్చిన పేషంట్ ఆడ ఉన్నాడు.అని బయట ఉన్న మర్రి చెట్టు కింద అరుగు చూపింది నర్స్.
ఏమ్ ఐలయ్య ఎలా ఉన్నావ్?!అని అడిగా..
నిన్ను ఈడీకి తెచ్చిన సార్ ఈననే అని నన్ను పరిచయం చేసింది నర్స్.
నేను ఇగ బత్క .. సస్త అనుకున్న సారూ..
దేవుని లెక్క వచ్చి కాపాడిన్రు అని కాళ్ళు మొక్క వట్టిండు.
నేను నీకు ఏమి ఇయ్యాల్నో తెలుస్తాలేదు సార్.నా ప్రాణం నిలబెట్టిండ్రు అని ఓ తెగ బాధ వట్టిండు.
ఇంతలోనే అతని తల్లి, భార్య పిల్లలు వచ్చారు.వస్తూనే..
సార్ నా ఇంటిదీపం కాపాడిన్డ్రు ..మీరు సల్లoగుండాలె అని ..డబ్బు ఇచ్చే ప్రయత్నం చేసింది.న నా గాజులు కుడువపెట్టి తెచ్చిన సార్.. తీస్కొండ్రీ అని చేతిలో పెట్టే యత్నం చేసింది. వద్దమ్మా..వద్దు. డబ్బు వాపస్ చేసి గాజులు తెచ్చుకో..అని చెప్పి, రెండు చేతులు జోడించి నమస్కారం చేశా.
దయచేసి ఐలయ్య తో.. బీడి మాన్పించి..నాకు చెప్పు.. సార్
మా ఆయన బిడి మానిండు అని.అది చాలు నాకు.
ఏమ్ ఐలయ్య ..
బి డి మానేస్తావా.,!
సార్..నా బిడ్డల మీద ప్రమాణం చేస్తున్నా..
ఇయ్యాలటి నుంచి బి డి బంద్ సార్.
మాచన రఘునందన్
9441252121
పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాశిల్దార్






