పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
గణపురం సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్
గణపురం,(విజయక్రాంతి): మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ ఇంచార్జ్ ఎంపీడీవో జి. శ్రీకాంత్, అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మోడల్ పాఠశాలలో వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. ప్రతి కుటుంబం ఒక మొక్కను నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. అనంతరం పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసి మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనం అందించాలని సూచించారు. వంటగదిలో పరిశుభ్రత పాటించాలని, కూరగాయలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తిరుపతి, పంచాయతీ కార్యదర్శి నవీన్, టెక్నికల్ అసిస్టెంట్లు సంపత్, నవ్య, రాజశ్రీ, ఫీల్డ్ అసిస్టెంట్ దూలం శ్రీదేవి, వార్డు మెంబర్ సౌమ్య శంకర్ తదితరులు పాల్గొన్నారు.






