6 May, 2026 | 10:35 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

ఫెమినా 'మిస్ ఇండియా' 2024 విజేతగా నిఖిత పోర్వాల్

17-10-2024 03:56 PM

ఫెమినా మిస్ ఇండియా 2024 కిరీటాన్ని మధ్య ప్రదేశ్ కు చెందిన నిఖిత పోర్వాల్ గెలుచుకున్నారు. ముంబైలోని ఫేమస్ స్టూడియోస్‌లో జరిగిన పోటీల్లో విజేతగా నిలిచిన నిఖిత మిస్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ఈ విజయంతో మిస్ వరల్డ్ అందాల పోటీల్లో భారత్ తరుఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న రేఖా పాండయ్య, గుజరాత్‌కు చెందిన ఆయుషి ధోలాకియా అందాల పోటీలో మొదటి రెండవ రన్నరప్‌లుగా నిలిచారు.

60 ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో భాగంగా 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ముద్దుగుమ్మలు పోటీ పడ్డారు. కేవలం తమ అందాలతోనే కాకుండా తమ ప్రతిభతోనూ జడ్జిలతో ప్రశంసలు అందుకున్నారు. తుదిపోరులో అదరగొట్టిన నిఖిత పోర్వాల్ కిరీటాన్ని దక్కించుకున్నారు. 2023 నుండి టైటిల్‌ను కలిగి ఉన్న రాజస్థాన్‌కు చెందిన మునుపటి టైటిల్‌హోల్డర్ నందిని గుప్త తర్వాత నిఖిత విజయం సాధించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన ప్రయాణం ఇప్పుడే ప్రారంభం అయిందని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని చెప్పారు.