17 April, 2026 | 7:31 PM

రాజ్యాధికారం కోసం మాదిగలు సంఘటితం కావాలి

17-04-2026 06:13 PM

ఎమ్మెస్ఎఫ్ జాతీయ నేత మంద కుమార్ మాదిగ

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు అత్యధిక జనాభా కలిగిన సామాజిక వర్గంగా ఉన్నప్పటికీ, రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో బలమైన శక్తిగా ఎదగడానికి సంఘటితం కావాల్సిన అవసరం ఉందని ఎమ్మెస్ఎఫ్ జాతీయ నేత మంద కుమార్ మాదిగ తెలిపారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెస్సీ జాతీయ నేత మంద కుమార్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జాతీయ అధికార ప్రతినిధి బుర్ర బిక్షపతి మాదిగలు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణ నివేదికలో మాదిగల జనాభా 10.43% గా తేలిందని, దానికి అనుగుణంగా ఎస్సీ వర్గీకరణలో మాదిగలకు 10% నుండి 11% రిజర్వేషన్లు కేటాయించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం మాదిగలలో ఉన్న పేదరికాన్ని తొలగించడానికి తగిన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలని, ప్రభుత్వ భూములను మాదిగలకు పంచాలని డిమాండ్ చేశారు. అత్యధిక జనాభా కలిగిన మాదిగలు శాసనమండలిలో, లోకసభలో, రాజ్యసభలో నామినేట్ పోస్టులలో ఒక్కరు కూడా లేరని, ఈ అన్యాయానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని అన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం మహాత్మా జ్యోతిరావు పూలే ద్విశత జయంతి ఉత్సవ కమిటీలో మందకృష్ణ మాదిగను సభ్యుడిగా చోటు కల్పించినందుకు, ప్రధాని నరేంద్ర మోడీకి యావత్తు మాదిగ జాతి తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెస్ పి జాతీయ నేత వేల్పుల సూరన్న కాపు, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు గద్దల సుకుమార్ మాదిగ, ఎమ్మెస్పి జిల్లా అధ్యక్షులు బండారి సురేందర్ మాదిగ, ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు పుట్ట రవి మాదిగ, మందరాజు మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జన్ను దినేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శిలు ఏక్ శంకర్ మాదిగ, జిల్లెల్ల మురళి మాదిగ, ఎంఎస్పీ జిల్లా సీనియర్ నాయకులు అంకెనకుంట వెంకటస్వామి, మాదిగ ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు రాజారావు బిక్షపతి మాదిగ, తదితరులు పాల్గొన్నారు.