వర్గీకరణ ఫలాలను మాదిగలు సద్వినియోగం చేసుకోవాలి
ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంచార్జి మంద కుమార్
సిద్దిపేట క్రైం, మే 17 : ఎస్సీ వర్గీకరణ ఫలాలను మాదిగలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంచార్జి మంద కుమార్ మాదిగ సూచించారు. ఆదివారం సిద్దిపేటలోని ప్రెస్ క్లబ్లో ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల జిల్లా కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి ఎమ్మార్పీఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ముక్కపల్లి రాజు మాదిగ అధ్యక్షత వహించగా, జిల్లా ఇంచార్జి మంద కుమార్ మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు గ్రామ స్థాయిలో ఎమ్మార్పీఎస్ను మరింత బలోపేతం చేయాలన్నారు.
మాదిగ సమాజంలో విద్య, ఉద్యోగాలపై విస్తృత అవగాహన కల్పించడం అత్యంత అవసరమన్నారు. ఆ దిశగా ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు నిరంతరం కృషి చేయాలని సూచించారు. జూలై 7న జరిగే ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి పల్లెలో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశంలో మల్లిగారి యాదగిరి, ప్రకాష్, జేరిపోతుల లక్ష్మణ్, చుంచు రమేష్, కొలిమి మల్లేశం, ఇస్తారీగల్లా ఎల్లం, తొగుట మండల నాయకులు నర్సిములు, నర్సింలు మల్లేశం, కిషన్ పాల్గొన్నారు.






