23 July, 2026 | 12:55 AM

తీరని డ్రైనేజీ తిప్పలు

23-07-2026 12:00 AM

రెండేళ్లుగా బడంగ్‌పేట్ మున్సిపల్ కాలనీవాసుల తీవ్ర అవస్థలు

బడంగ్‌పేట్, జూలై 22 (విజయక్రాంతి): మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బడంగ్పేట్ కార్పొరేషన్ జోన్ 61, మున్సిపల్ కాలనీలో అధికారుల అసంపూర్తి పనులు స్థానికులకు శాపంగా మారాయి. కాలనీలో డ్రైనేజీ పైప్లైన్ నిర్మాణం చేపట్టి దాదాపు రెండేళ్లు పూర్తవుతున్నప్పటికీ, ఇప్పటివరకు దానికి అవుట్లెట్ కనెక్షన్ ఇవ్వకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర నరకయాతన అనుభవిస్తున్నారు. 

ఇళ్ల ముందే మురుగు నిల్వ ..విపరీతమైన దుర్వాసన..

వాడకపు నీరు ముందుకు వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో మురుగు నీరంతా కాలనీ రోడ్లపై, ఇళ్ల ముందే నిలిచిపోతోంది. దీంతో కాలనీ అంతటా దుర్వాసన వెదజల్లుతుండటంతో స్థానికులు ముక్కు మూసుకొని బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నిల్వ ఉ న్న మురుగునీటిలో దోమలు, పందులు విపరీతంగా పెరిగిపోయి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి విషజ్వరాలు వేగంగా వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు తరచూ రో గాల బారిన పడుతున్నారు. మరోవైపు వర్షాలు పడితే ఈ మురుగునీరు రోడ్లను ముంచెత్తి, ఇళ్లలోకి చేరే ప్రమాదం ఉందని కాలనీవాసులు భయాందోళన చెందుతున్నారు.

పన్నులు కడుతున్నా పట్టింపు లేదా..?

పన్నుల రూపంలో కార్పొరేషన్కు చెల్లించాల్సిన అన్ని రుసుములను క్రమం తప్ప కుండా సకాలంలో చెల్లిస్తున్నాం. అయినప్పటికీ మా కాలనీలో కనీస మౌలిక వసతులైన డ్రైనేజీ సమస్యను పరిష్కరించకపోవడం దారుణం‘ అని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు.

అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసా ర్లు విన్నవించినా ప ట్టింపులేకుండా వ్య వహరి స్తున్నారని ఆ వేదన వ్యక్తం చేశారు. బడంగ్పేట్ మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే స్పం దించి, యుద్ధపాతిపదికన డ్రైనేజీ అవుట్లెట్ కనెక్షన్ పనులను పూర్తి చేయాలి. లేనిపక్షంలో కాలనీవాసులందరం ఏకమై మున్సి పల్ కార్పొరేషన్ ఆఫీస్ను ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు.