23 July, 2026 | 1:15 AM

రైతు బజార్ లేక తప్పని తిప్పలు!

23-07-2026 12:41 AM
  1. రోడ్డుపైనే క్రయవిక్రయాలు 
  2. రాకపోకలకు ఇబ్బందులు 
  3. దోచుకుంటున్న దళారులు

ఘట్ కేసర్, 22 (విజయక్రాంతి) : ఘట్కేసర్ ఒకప్పుడు గ్రా మం కావచ్చు, కానీ నేడు ఐటీ కారిడార్కు సమీపం లో వేగంగా విస్తరిస్తున్న ఒక ప్రధాన పట్టణం. జనాభా విపరీతంగా పెరుగుతోంది. దానికి తగ్గట్టే కూరగాయల అవసరాలూ పె రిగాయి. కానీ ఇంత పెద్ద పట్టణంలో ఇప్పటికీ ఒక అధికారిక రైతు బజార్ లేకపోవడం ఇటు స్థానిక ప్రజలకు, అటు చుట్టుపక్కల గ్రామాల రైతులకు శాపంగా మారింది. ఈనేపథ్యంలో ఘట్కేసర్లో రైతు బజార్ లేకపోవ డం వల్ల రైతులు, వినియోగదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.

దళారులదే రాజ్యం!

రైతుబజార్ ఉంటే రైతు నేరుగా వినియోగదారుడికి కూరగాయలు అమ్ముతాడు. దీ నివల్ల ధరలు అదుపులో ఉంటాయి. కానీ ఇక్కడ ఆ సదుపాయం లేక ప్రజలు పూర్తిగా ప్రైవేట్ మార్కెట్లు, వీధి వ్యాపారులపై ఆధారపడాల్సి వస్తోంది.

ధరల భారం

దళారీల చేతులు మారి వచ్చే సరికి కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఎక్కువ ధరలు పెట్టి కొన్నా, వినియోగదారులకు తాజా కూరగాయలు దొరకడం గగనమైపోతోంది.

రోడ్లపైనే రైతుల విక్రయాలు ప్రాణసంకట ప్రయాణం

చుట్టుపక్కల గ్రామలైన ఎదులాబాద్, బొక్కొని గూడ, చందుపట్లగూడ, పోచారం, కొండాపూర్, అవుషాపూర్, అంకుషాపూర్, మాదారం వంటి ప్రాంతాల నుండి రైతులు తాము పండించిన పంటను అమ్ముకోవడానికి ఘట్కేసర్ వస్తుంటారు.

ఎండనక, వాననక..

సరైన షెడ్లు, మార్కెట్ యార్డు లేకపోవడంతో రైతులు ఘట్కేసర్ ప్రధాన రహ దారుల పక్కనే రోడ్డుపైనే కూరగాయలు పెట్టుకుని అమ్ముకుంటున్నారు.

ట్రాఫిక్ జామ్ ప్రమాదాలు

రోడ్డు పక్కనే వ్యాపారాలు సాగడం వల్ల ఘట్కేసర్ టౌన్లో తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. కూరగాయలు కొనేందుకు ప్రజలు రోడ్డుపైనే వాహనాలు నిలపడం వల్ల తరచూ చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతున్నాయి.

కష్టమొకరిది& ఫలితం మరొకరిది!

మేము రాత్రింబవళ్లు కష్టపడి పంట పం డిస్తే, మాకు సరైన ధర దక్కడం లేదని రైతు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పక్కన కూర్చుని అమ్ముకుందామంటే మున్సిపాలిటీ వాళ్లు, పోలీసులు తీసేయమంటారు. ఒకవేళ వ్యాపారులకు తక్కువ ధరకే అమ్ముకుంటే, వాళ్లు మార్కెట్లో దాన్ని డబుల్ రే టుకు అమ్ముకుంటున్నారు. మాకు శ్రమ త ప్ప మిగిలేదేం లేదు‘ అని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తక్షణ ఆవశ్యకత

ఘట్కేసర్ పట్టణ కేంద్రంలో లేదా అనువైన ప్రాంతంలో ఒక పూర్తి స్థాయి రైతుబ జార్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఫలితంగా రైతులకు దళారీల దోపిడీ తప్పి, పంటకు గిట్టుబాటు ధర దక్కుతుంది. పట్టణ ప్రజలకు తక్కువ ధరకే తాజా కూరగాయలు లభిస్తాయి. రోడ్ల పక్కన వ్యాపారాలు తగ్గి, ట్రాఫిక్ సమస్య పరిష్కారమవుతుంది. పాలకులు, సంబంధిత శాఖ అధికారులు ’రైతు బజార్’ నిర్మాణానికి అడుగులు వేయాలని స్థానికులు కోరుతున్నారు.