17 May, 2026 | 2:25 AM

యువతి గొంతుకోసి చంపిన ఉన్మాది

17-05-2026 12:16 AM
  1. యువకుడికి దేహశుద్ధి చేసిన స్థానికులు
  2. మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్లలో దారుణం

జడ్చర్ల, మే 16 (విజయక్రాంతి): మహబూ బ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల మున్సిపాలిటీలో దారుణం చోటుచేసుకుంది. డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న యువతిని ఓ యువకుడు అతి కిరాతకంగా కత్తితో దాడి చేసి హత్య చేసిన సంఘటన చోటుచేసుకుంది. అక్కడే ఉన్న స్థానికులు యువకుడిని పట్టుకొని చితకబాదారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జడ్చ ర్ల పట్టణంలోని నిమ్మబావిగడ్డ ప్రాంతానికి చెందిన వైష్ణవి(22) పోలేపల్లి సెజ్ లోని ఎస్వీకేయం పాఠశాలలో విధులు నిర్వహిస్తుంది.

రోజూ మాదిరిగానే స్కూల్ ముగియగానే ఇం టికి బయల్దేరింది. వైష్ణవిని గతకొంతకాలంగా వేధిస్తున్న హైదరాబాద్‌కు చెందిన రామచందర్ శనివారం అడ్డుపడి మరోసారి ఆమెను వేధింపులకు గురిచేశాడు. సరిగ్గా వైష్ణవి ఇంటి వద్దకు రాగానే తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి గొంతు కోశా డు. తీవ్ర రక్తస్రావం కావడంతో యువతి అక్కడికక్కడే మృతి చెందింది. ఇది గమనించిన స్థానికులు పారిపోతున్న యువకుడిని పట్టుకొని దాడి చేశారు. ఈ దాడిలో యువకుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అత ని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.