17 May, 2026 | 2:25 AM

ముఖ్యమంత్రివి పగటి కలలే!

17-05-2026 12:18 AM

బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్‌వీ సుభాష్

హైదరాబాద్, మే 16 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2034 వరకు తానే సీఎంను అనే వ్యాఖ్యలు ‘ముంగేరీలాల్ కే హసీన్ సప్నే’లా ఉన్నాయని బీజేపీ ముఖ్యఅధికార ప్రతినిధి ఎన్‌వీ సుభాష్ విమర్శించారు. ఈమేరకు ఆయన శనివారం ఒక ప్రకటనను విడుదల చేశారు. 2034 వరకు సీఎం... తర్వాత జాతీయ రాజకీయాలు అనేవి పగటి కలలే అని పేర్కొన్నారు. హామీలు నెరవేర్చలేని సీఎం జాతీయ రాజకీయాలపై కలలు కంటున్నారని మండిప్డడారు.

ప్రజా సమస్యలు పక్కన పెట్టి ఢిల్లీ రాజకీయాలపై ఫోకస్ పెట్ట డం దుర దృష్టకరమన్నారు. రాజకీయాలు సినిమాలు కావని, ప్రజల తీర్పే ఫైనల్ అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ లాంటి బలమైన నేతలకే ప్రజలు షాక్ ఇచ్చారని, ఈ కాంగ్రెస్ ఎంత?, ప్రజల తీర్పు ముందు ఎవరూ శాశ్వతం కాదని తెలిపారు. ముందు 2028లో గెలుస్తారో లేదో చూసుకోవాలని, తర్వాత 2034 సంగతి మాట్లాడాలని ఎద్దేవా చేశారు. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ వేగంగా బలపడుతోందన్నారు.