23 June, 2026 | 2:35 PM

Breaking News

భూక్యారెడ్డితండాలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కింద ఎక్స్‌రే పరీక్షలు   •   ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా: నియోజకవర్గం ఇన్చార్జి   •   రైతులు విత్తనాల మేళాను సద్వినియోగం చేసుకోవాలి   •   యూరియా కోసం రైతుల ధర్నా.. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే అరెస్ట్   •   పోతారంలో చిన్న వానకే చెరువులా ప్రధాన రహదారి   •   ఏసీబీకి చిక్కిన నిజామాబాద్ ఎక్సైజ్ సూపరిండెంట్   •   శ్యామా ప్రసాద్ ముఖర్జీ త్యాగం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకం   •   రవీంద్రభారతిలో కవి ద్యావరి నరేందర్ రెడ్డికి ఘన సత్కారం   •   సర్వే నంబర్ 218 బాధితులకు అండగా పువ్వాడ అజయ్ కుమార్   •   ప్రభుత్వం గుర్తించిన ఏడు సన్న రకాలను సాగు చేస్తేనే రైతులకు బోనస్   •  

మహదేవన్‌కు గ్రామీ నామినీ మెడల్

03-02-2026 01:32 AM

అమెరికాలో జరిగిన ప్రీ-గ్రామీ నామినీల రిసెప్షన్‌లో ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 2026 గ్రామీ అవార్డుల వేడుకకు ముందు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన నామినీ మెడల్‌ను స్వీకరించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఫ్యూజన్ బ్యాండ్ శక్తితో కలిసి ఆయనకు ఈసారి రెండు గ్రామీ నామినే షన్లు రావడం విశేషం. వారి తాజా ఆల్బమ్ ‘మైండ్ ఎక్స్‌ప్లోజిన్’ బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్’ విభాగంలో నామినేట్ కాగా, శక్తి డ్రీమ్ పాట ‘బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్’ కేటగిరీలో పోటీ పడుతోంది.

ఇదివరకే 2024లో శంకర్ మహదేవన్, శక్తి బ్యాండ్‌తో కలిసి ‘దిస్ మూమెంట్’ ఆల్బమ్‌కు గాను ‘బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్’ అవార్డు అందుకున్నారు. సంగీత రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ అవార్డుల వేడుక ది రికార్డింగ్ అకాడమీ ఆధ్వర్యంలో అమెరికాలోని కాలిఫోర్నియా వేదికగా జరిగింది. 68వ గ్రామీ అవార్డుల వేడుకలో ప్రపంచవ్యాప్తంగా తమ పాటలు, ఆల్బమ్‌లతో ప్రేక్షకులను అలరించినవారు పురస్కారాలు అందుకున్నారు.