calender_icon.png 3 February, 2026 | 10:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రేక్షకులు భావోద్వేగంతో బయటికి వస్తున్నారు

03-02-2026 01:30:13 AM

అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ, రఘు కుంచె ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘దేవగుడి’. పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్‌పై బెల్లం రామకృష్ణారెడ్డి రచనా దర్శకత్వంలో స్వీయ నిర్మాతగా రూపొందించారు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో మూవీ సక్సెస్ మీట్‌ను హైదరా బాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్ర మంలో హీరో అభినవ్ శౌర్య మాట్లాడుతూ.. “హీరో కావాలన్న నా కలను, పడిన శ్రమను ‘దేవగుడి‘ సినిమాకు వస్తున్న స్పందనతో మర్చిపోయా” అని చెప్పారు.

హీరోయిన్ అనుశ్రీ మాట్లాడుతూ.. “సినిమా చూసి బయటకు వస్తుంటే శ్వేతారెడ్డి అని ఆడియెన్స్ పిలుస్తున్నారు. నటిగా నాకు దక్కిన గుర్తింపు అని నమ్ముతున్నా” అని తెలిపారు. దర్శక నిర్మాత రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. “మా సినిమా అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. కొందరు ఆడియెన్స్ సినిమా చూసి బయటకు వస్తూ భావోద్వేగానికి గురవుతున్నారు” అన్నారు. నటులు రఘుకుంచె, నటుడు నరసింహ తోషి తదితరులు పాల్గొన్నారు.