17 April, 2026 | 10:34 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

సమాజ శ్రేయస్సుకే మహాలక్ష్మియాగం

03-03-2026 12:04 AM

శ్రీశ్రీశ్రీ రామానుజ జీయర్ స్వామి 

కాగజ్‌నగర్, మార్చి 2 (విజయ క్రాంతి): కాగజ్‌నగర్ పట్టణంలో త్వరలో నిర్వహించనున్న మహాలక్ష్మి యాగం సమాజ శ్రేయస్సుకు, ప్రజల ఆయురారోగ్యాలకు, సౌభాగ్య సమృద్ధికి దోహదపడాలని శ్రీశ్రీశ్రీ రామానుజ జీయర్ స్వామి పేర్కొన్నారు. యాగం విజయవంతం కావాలని సంకల్పంతో భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ  మహాలక్ష్మి యాగం ద్వారా పట్టణంలో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందుతుందని, సద్భావన, సమరసత మరింత బలపడతాయని అన్నారు. భక్తుల సహకారంతో ఈ యాగాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

పట్టణంలోని ప్రధాన వీధుల్లో భిక్షాటన చేస్తూ యాగ మహిమను భక్తులకు వివరిస్తూ ఆశీర్వచనాలు అందించినట్లు చెప్పారు. డా. పాల్వాయి హరీష్‌బాబు పాల యాగం విజయానికి  సం పూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణ ప్రముఖులు, వివిధ సంఘాల ప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వచ్ఛందంగా భిక్షా దానాలు సమర్పించి యాగానికి సహకరించినట్లు స్వామి తెలిపారు. మహాలక్ష్మి యాగానికి సంబంధించిన తేదీలు, కార్యక్రమ వివరాలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు.