రాజన్న ఆలయంలో మహాలింగార్చన
06-06-2024 12:05 AM
రాజన్న సిరిసిల్ల, జూన్ 5 (విజయక్రాంతి): వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో బుధవారం మాస శివరాత్రి సందర్భంగా ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఆలయంలో ఉదయం స్వామి వారికి మహాన్యాస పూరక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతలకు ప్రత్యేక అర్చనలు చేపట్టారు. రాత్రి స్వామివారి కల్యాణమండపంలో ఘనంగా మహాలింగార్చన చేపట్టారు. భక్తులు ఆలయంలో దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.






