17 July, 2026 | 6:35 AM

మూడు రోజులు వర్షాలు

06-06-2024 12:05 AM

హైదరాబాద్ వాతావరణ కేంద్రం

హైదరాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మొన్నటివరకు అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు సతమతమవగా, వర్షాలు కురవడంతో వాతావరణం చల్లబడి ఊపిరిపీల్చుకుంటున్నారు. వర్షాకాలం మొదలవడంతో రైతులు దుక్కులు దున్నుతూ విత్తనాలు వేసేందుకు సిద్ధమవుతున్నారు. వరి నారు పోసేందుకూ మళ్లను తయారు చేసుకుంటున్నారు. బుధవారం రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో వర్షం కురిసింది.