25 March, 2026 | 1:26 AM

ఉప్పల్ చెరువులకు మహర్ధశ

25-03-2026 12:00 AM

హైడ్రా కమిషనర్ రంగనాథ్ 

ఉప్పల్ మార్చి 24విజయక్రాంతి :ఉప్పల్ నియోజకవర్గంలోని అన్ని చెరువుల అభివృద్ధి, సుందరీకరణకు చేయనట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. ఉప్పల్ నియోజకవర్గం హెచ్‌ఎంటి పెద్ద చెరువును కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ పరమేశ్వర్రెడ్డి స్థానిక కాంగ్రెస్ నాయకులుతో కలిసి మంగళవారం రోజు ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప్పల్ ని యోజకవర్గంలోని చెరువులను రూ.102 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్టుగా ఆయన పేర్కొన్నారు.

చెరువులలో అభివృద్ధితో పా టు సుందరీకరణ పనులను కూడా చేపడుతున్నట్టుగా ఆయన తెలిపారు. అనంతరం ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జీ మందుముల పరమేశ్వర్రెడ్డి మాట్లాడుతూఉప్పల్ నియోజకవర్గంలోని అన్ని చెరువుల అభివృద్ధి, సుందరీకరణకు కృషి చేస్తున్నట్టుగా ఉప్పల్ నియోజకవర్గం ఆయ న తెలిపారు. నియోజకవర్గంలో మొదటి విడతలో నాలుగు చెరువుల అభివృద్ధి, సుం దరీకరణ పనులకు నిధులు సైతం మం జూరు చేయించినట్టుగా చెప్పారు.

ఉప్పల్ నల్ల చెరువు రూ.20 కోట్లు, నాచారం(హెచ్‌ఎంటీనగర్) చెరువు రూ.30 కోట్లు, కాప్రా చెరువు రూ.35 కోట్లు, రామంతాపూర్ పెద్ద చెరువు రూ.17 కోట్ల చొప్పున నిధులొచ్చినట్టుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఎంటీ కాలనీ ప్రధాన కార్యదర్శి రామకోటేశ్వరరావు రవీందర్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులు కృష్ణారెడ్డి, హెచ్‌ఆర్ మోహన్ ప్రకాష్ రెడ్డి, అశ్వద్ధామ రెడ్డి నూతలకంటి రాజు, సంతోష్‌రెడ్డి, రాజిరెడ్డి, కృష్ణ యాదవ్, వెంకట్‌రెడ్డి, వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.