3 April, 2026 | 10:46 AM

భగీరథ మహర్షి సేవలు చిరస్మరణీయం

15-05-2024 01:56 AM

ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ

కూకట్‌పల్లి, మే 14 : ఒంటి కాలిపై తపస్సు చేసి సమస్త జీవకోటికి ప్రాణధారమైన గంగను దివి నుంచి భువికి తీసుకొచ్చి న గొప్ప వ్యక్తి రాజర్షి సగర కుల గురువు భగీరథ మహర్షిఅని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. మంగళవారం ఆయన జయంతిని పురస్కరించుకొని జగద్గిరిగుట్ట సగర ఉప్పర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకలకు ఎమ్మెల్యే గాంధీ ముఖ్య అతిథిగా హాజరై, భగీరథ మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సగర ఉప్పర కులస్తుల ఆరాధ్య దైవం భగీరథుడని, ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ ఆయన పేరు మీద మిషన్ భగీరథ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఇంటింటికీ తాగునీటి సరఫరాను అందజేసి పేద ప్రజల దాహార్తిని తీర్చి భగీరథ మహర్షికి గుర్తింపును తీసుకొచ్చారని తెలిపారు. సగర ఉప్పర సంఘం కమిటీకి తాను అన్నివేళలా సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు. కార్యక్ర మంలో వివేకానంద నగర్ డివిజన్ కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగారావు, బీఆర్‌ఎస్ నాయకులు సంజీవరెడ్డి, సగర సంఘం కమిటీ సభ్యులు అస్కాని కొండయ్య, శ్రీనివాస్, రాజేష్ సాగర్, వెంకటస్వామి సాగర్, మండల రవి సాగర్, ఆవుల వెంకటరాములు సాగర్, దిండి రామస్వామి సాగర్ పాల్గొన్నారు.