3 April, 2026 | 2:58 AM

హనుమంతుని వ్యక్తిత్వం ఆదర్శం

03-04-2026 01:48 AM

హనుమాన్ జయంతి సందర్భంగా ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు

జ్ఞానం, వాక్చాతుర్యం, బలం, భక్తి, వినయం అన్నీ కలగలిసిన సంపూర్ణ వ్యక్తిత్వం హను మంతుడికే సాధ్యమని, వారి ఆచరణ ఎల్లకాలం ఆదర్శనీయమని, నేటి యువతరానికి ఆచరణీయమని మాజీ సీఎం కేసీఆర్, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. సీతారామచంద్రమూర్తి భక్తుడుగా, బలం, జ్ఞానం, వాక్చాతుర్యం అన్నీకలిసి, అరుదైన వ్యక్తిత్వం కలిగిన జ్ఞానిగా, హిందూ పురాణాలు హనుమంతుడిని కీర్తిస్తాయని కేసీఆర్ తెలిపారు.

ధర్మ రక్షణ కోసం, తాను నమ్మిన శ్రీరామునికి తన శక్తినంతా ధారపోసి, ఎటువంటి ప్రతి ఫలాపేక్ష లేకుండా, ప్రజా సంక్షేమం కోసం నాయకత్వాన్ని తన భుజాలమీద మోసిన బలశాలి, వినయానికి, విజయానికి మార్గదర్శి, మృదుస్వభావి ఆంజనేయ స్వామి అని కొనియాడారు. ఆదర్శవంతమైన ఆలోచనలతో, దూరదృష్టితో, ప్రజలు తమ జీవితాలను తీర్చిదిద్దుకునే శక్తిని అందించాలని కేసీఆర్ ప్రార్ధించారు.