హైదర్‌నగర్ డివిజన్ అభివృద్ధికి పెద్దపీట వేస్తా
కార్పొరేటర్ నార్నే శ్రీనివాస్‌రావు
కూకట్‌పల్లి, మే 14 : హైదర్‌నగర్ డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం డివిజన్ పరిధిలోని హెచ్‌ఎంటి శాతవాహన నగర్ కాలనీలో చేపడుతున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను కాలనీవాసులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ హైదర్‌నగర్ డివిజన్‌లో ఇప్పటికే కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు.
ప్రధానంగా డ్రైనేజీ, విద్యుత్, తాగునీటి సరఫరాతో పాటు ఇతర సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తున్నామన్నారు. డివిజన్ పరిధిలోని ఆయా కాలనీలలో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తూ కాలనీలను అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల్లో అధికారులు నాణ్యత ప్రమాణాలు పాటించి త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు పోతుల రాజేందర్, కాలనీ వాసులు యాదిరెడ్డి, రామకోటేశ్వరరావు, కృష్ణమూర్తి, అందే నర్సింహ, మదన్, సీతారాముడు, వెంకటరామిరెడ్డి, రామేశ్వర్, బాబురావు పాల్గొన్నారు.




