14 August, 2026 | 3:52 PM

Breaking News

ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ప్రహరీ, రోడ్డు సౌకర్యం కల్పించాలి   •   సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలి   •   హల్ద్వానీ ఘటనకు నిరసనగా కామారెడ్డిలో సత్యాగ్రహ దీక్ష   •   గీత దాటితే సీఎంతో సహా అందరూ ఒకటే: రాజగోపాల్‌పై పీసీసీ చీఫ్‌ ఆగ్రహం   •   రామాలయంలో ప్రారంభమైన లలిత సహస్రనామాల పారాయణం.   •   నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టును కాపాడాలి: చాడ వెంకటరెడ్డి   •   ఈనెల 16న జయశంకర్ జిల్లా క్రికెట్ క్రీడాకారుల సమావేశం   •   సెప్టెంబర్ మొదటివారంలో పనులు మొదలు కావాల్సిందే   •   జేపీ నడ్డాకు అస్వస్థత.. ఎయిమ్స్ కీలక ప్రకటన   •   వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి జిల్లా పోలీసులు   •  

తమిళనాడు గవర్నర్... బీజేపీ "గేట్ కీపర్"

07-05-2026 04:58 PM

హైదరాబాద్: తమిళనాడు గవర్నర్ తీరుపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్(TPCC Chief Mahesh Goud) అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు టీవీకేకు ఇచ్చిన తీర్పును గవర్నర్ అగౌరవపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్.. కేరళ పర్యటన పేరుతో జాప్యం చేయడం యాదృచ్ఛికం కాదన్నారు. గవర్నర్ .. కేరళ పర్యటన కుట్ర రాజకీయాల్లో భాగమే అన్నారు. గవర్నర్ రాజ్యంగ పదవిలో ఉన్న బీజేపీ గేట్ కీపర్ అని స్పష్టమవుతోందన్నారు. 

రాజ్యాంగం ప్రకారం గవర్నర్ హోదా నామమాత్రమే అన్నారు. విచక్షణాధికారాన్ని బీజేపీ కోసం దుర్వినియోగం చేయడం రాజ్యంగ ద్రోహమని పేర్కొన్నారు. ప్రజల కలలను గవర్నర్ లోక్ భవన్ లో బంధించడం ప్రజాస్వామ్యానికి మచ్చగా అభివర్ణించారు. గవర్నర్ వ్యవస్థను బీజేపీ రాజకీయ పావుగా వాడుకుంటే సమాఖ్య స్ఫూర్తికే ప్రమాదం అన్నారు.