7 May, 2026 | 5:55 PM

Breaking News

మురుగు నీటిని నిల్వ ఉంచకుండా ప్రత్యేక శ్రద్ధ వహించండి   •   వరదల నివారణ చర్యలపై ప్రణాళికతో ముందుకు వెళ్లాలి   •   సబ్ ట్రెజరీ కార్యాలయం తరలించవద్దు   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసిన సర్పంచ్   •   వైన్ షాప్ ల వద్ద ట్రాఫిక్ కష్టాలు.. చర్యలు తీసుకోండి   •   రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు   •   మంద రాజయ్య కు ఘనంగా నివాళులర్పించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు   •   ఇంటర్ బోర్డు విలీనంపై ప్రభుత్వం పునరాలోచించాలి   •   మాల్తుమ్మెద పిఏసిఎస్ చైర్మన్ దుందిగల్ నర్సింలుకు ఘన సన్మానం   •   సౌర విద్యుత్తును వినియోగించి పంటలను సాగు చేసుకోండి   •  

టీవీకే, సీపీఐ నేతల సమావేశం.. సీపీఐ ఆఫీస్ కు టీవీకే నేత

07-05-2026 05:25 PM

చెన్నై: తమిళనాడులో ప్రభుత్వా ఏర్పాటుపై గవర్నర్ సస్పెన్స్ కొనసాగుతోంది. విజయ్ టీవీకే(Vijay TVK) పార్టీకి మెజార్టీ లేదని గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించలేదు. దీంతో టీవీకే సంఖ్యాబలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 234 స్థానాలకు గాను 108 స్థానాలను గెలుచుకుని ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన TVK రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు సాగిస్తున్న నేపథ్యంలో TVK సంయుక్త ప్రధాన కార్యదర్శి CTR నిర్మల్ కుమార్, పార్టీ నాయకులతో కలిసి చెన్నైలోని CPI (Communist Party of India) కార్యాలయాన్ని సందర్శించి అక్కడి నాయకులను కలిశారు. కాసేపటి క్రితమే టీవీకే, సీపీఐ నేతల సమావేశం ముగిసింది. టీవీకేకు మద్దతివ్వాలని సీపీఐ నేత వీరపాండ్యన్ ను కోరామని తెలిపారు. పార్టీ అధిష్ఠానంతో చర్చించి నిర్ణయం చెబుతామన్నారని నిర్మల్ కుమార్ వెల్లడించారు. ప్రస్తుతం కాంగ్రెస్ తో కలిపి టీవీకేకు 113 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. సీపీఐ, సీపీఎం మద్దితిస్తే టీవీకే బలం 117కు చేరుతోంది.