04-02-2026 10:48:54 AM
వాంకిడి,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని గ్రామపంచా యతీ కార్యాలయానికి వెళ్లే ప్రధాన రహదారి(Main road) 4వ వార్డులో ఇప్పటికీ అంధకారంలోనే ఉంది. ప్రజాధనంతో ఇటీవల కొత్తగా విద్యుత్ స్థంభాలు ఏర్పాటు చేసినప్పటికీ, వాటికి విధిదీపాలు అమర్చకపోవడం అధికారుల నిర్లక్ష్యాన్ని బయట పెడుతోంది. ప్రజలకు కనీస సౌకర్యం కూడా అందని పరి స్థితి నెలకొంది.
రానున్న పది రోజుల్లో మహాశివరాత్రి పర్వ దినాన్ని పురస్కరించుకొని భక్తజనుల రాకపోకలు అధి కంగా ఉండనున్నాయి. అయినా సరే, ఈ మార్గంలో భద్రతా ఏర్పాట్లపై ప్రభుత్వం, సంబంధిత శాఖలు పట్టించు కోకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. రాత్రి వేళ మహిళలు, వృద్ధులు, పిల్లలు భయంతో ప్రయాణించాల్సి వస్తుండగా, ప్రమాదాలు జరిగితే బాధ్యత ఎవరిదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే వీధి దీపాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.