04-02-2026 11:30:04 AM
అభ్యర్థులకు బీ ఫారాలు అప్పగింత
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఎట్టకేలకు అభ్యర్థుల జాబితాలు విడుదల చేశారు. నామినేషన్ల ఉపసహరణ ప్రక్రియ దృష్ట్యా మంగళవారం సాయంత్రం వరకు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ అభ్యర్థుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ఎమ్మెల్యే గడ్డం వినోద్, డీసీసీ రఘునాథరెడ్డి ప్రకటించగా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తన కార్యాలయంలో బీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. అలాగే బీజేపీ, సీపీఐలు కూడా అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ 34 వార్డుల్లో అభ్యర్థులను ప్రకటించగా, బీజేపీ 20, సీపీఐ 6 వార్డుల్లో అభ్యర్థులను రంగంలోకి దింపింది. ఈ మేరకు ఆయా పార్టీలు తమ అభ్యర్థుల బి ఫారాలను ఎన్నికల అధికారులకు మూడు గంటలకు ముందే అందజేశారు.
కాంగ్రెస్ అభ్యర్థులు వీరే..
బెల్లంపల్లి ఒకటవ వార్డు అభ్యర్థిగా మాదరి లక్ష్మి, రెండవ వార్డుకు గోమాస ప్రవీణ్ కుమార్, మూడవ వార్డుకు పోరండ్ల సత్యవతి, నాలుగవ వార్డుకు పంగ శాంత, ఐదవ వార్డుకు పేరపల్లి పరమేష్, ఆరవ వార్డుకు దుబాసి వరలక్ష్మి వెంకటస్వామి, ఏడవ వార్డుకు దావా స్వాతి, ఎనిమిదవ వార్డుకు Md. నిజమోద్దీన్, తొమ్మిదవ వార్డుకు రొడ్డ శారద, 10వ వార్డుకు డీకొండ పద్మ, 11వ వార్డుకు గాలి సుమలత, 12వ వార్డుకు జర్పుల లక్ష్మి, 13వ వార్డుకు బండి ఉమ, 14వ వార్డుకు ముక్కెర సోమశేఖర్, 15వ వార్డుకు చింతల వసంత, 16వ వార్డుకు రేగుంట రమాదేవి, 17వ వార్డుకు రాగంశెట్టి సత్యనారాయణ, 18వ వార్డుకు తస్లీమా సుల్తానా, 19వ వార్డుకు కాంపల్లి దయామణి, 20వ వార్డుకు మత్తమారి సరస్వతి. 21వ వార్డుకు ఎలుక ఆకాష్, 22వ వార్డుకు ఆకుల లలిత, 23వ వార్డుకు జంగం కల్పన, 24వ వార్డుకు దామెర విజయలత, 25వ వార్డుకు కంకటి ప్రణిత, 26వ వార్డుకు ఇప్ప కుమారస్వామి, 27వ వార్డుకు బేటి శ్రావణ్ కుమార్, 28వ వార్డుకు చిప్ప అర్చన, 29వ వార్డుకు మేడి పున్నంచంద్, 30వ వార్డుకు గెల్లి విజయలక్ష్మి, 31వ వార్డుకు గెల్లి సంధ్య, 32వ వార్డుకు నీలి హారిక, 33వ వార్డుకు బండి రజిత, 34వ వార్డుకు గడ్డం కవితలు బరిలో ఉన్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థులు వీరే..
బీఆర్ఎస్ పార్టీ ఒకటవ వార్డు అభ్యర్థిగా కొయ్యడ ప్రసన్న, రెండవ వార్డు అభ్యర్థిగా సబ్బని అరుణ్, మూడవ వార్డుకు లక్కాకుల సౌజన్య, నాలుగవ వార్డుకు ఈట కమల, ఐదవ వార్డుకుగోగర్ల స్వప్న, ఆరవ వార్డుకు సల్ల కృష్ణవేణి, ఏడవ వార్డుకు ఆరే వరలక్ష్మి, ఎనిమిదో వార్డుకు అబ్దులా నయీం, తొమ్మిదో వార్డుకు కంపెల్లి రాజం, పదవ వార్డు అభ్యర్థిగా తోడే మల్లమ్మ, 11వ వార్డుకు మోర అనసూర్య (మానస), 12వ వార్డుకు తిరుమల వాసు, 13వ వార్డుకు దొంగల రాజ్‌కుమార్, 14వ వార్డుకు అసది మధుకర్, 15వ వార్డుకు రామగిరి మాధవి, 16వ వార్డుకు కత్తి శ్రీనివాస్, 17వ వార్డుకు రాపెల్లి విజయ్ కుమార్, 18వ వార్డుకు బత్తుల అనిత, 19వ వార్డుకు షేక్ షమేమ్, 20వ వార్డుకు తాండ్ర స్రవంతి రామకృష్ణ, 21వ వార్డుకు రాజనాల రమేష్, 22వ వార్డుకు ఆదూరి ప్రవళిక, 23వ వార్డుకు మధుసుల శ్రుతి, 24వ వార్డుకు కొత్తూరి వరలక్ష్మి, 25వ వార్డుకు డి. స్వరూప, 26వ వార్డుకు రేణికుంట్ల సరిత, 27వ వార్డుకు బైరం రాజేందర్, 28వ వార్డుకు గద్దల ధర్మేందర్, 29వ వార్డుకు రాజులాల్ యాదవ్, 30వ వార్డుకు MD. జరీనా, 31వ వార్డుకు బండారి స్రవంతి, 32వ వార్డుకు దేవ రజిత, 33వ వార్డుకు మోతే స్రవంతి, 34వ వార్డుకు గోలి సదానంద్ లు బరిలో ఉన్నారు.
బీజేపీ అభ్యర్థులు వీరే...
బెల్లంపల్లి మున్సిపాలిటీ బీజేపీ నుంచి రెండవ వార్డు అభ్యర్థిగా పట్టి వెంకటకృష్ణ, నాలుగవ వార్డు అభ్యర్థి ఎనగందుల మౌనిక, ఐదవ వార్డుకు సముద్రాల సుధాకర్, ఆరవ వార్డుకు ఉప్పు లక్ష్మి, ఎనిమిదవ వార్డుకు గోలి శ్రీనివాస్, తొమ్మిదవ వార్డుకు బాగ్ మోహన్, 11వ వార్డుకు గుర్రం శ్రావణి, 12వ వార్డుకు బుక్య రాజు, 14వ వార్డుకు కళ్ళపెళ్లి నవీన్, 16వ వార్డుకు కోయల్కర్ గోవర్ధన్, 18వ వార్డుకు రచ్చ స్వప్న, 20వ వార్డుకు దార రాజేష్, 21వ వార్డుకు కోల అరుణ్ కుమార్, 23వ వార్డుకు నిట్ట అరుణాసుందరి, 26వ వార్డుకు ఇప్ప స్వామి, 27వ వార్డుకు గంగారపు రమేష్, 28వ వార్డుకు గాండ్ల మహేష్, 29వ వార్డుకు కోడి రమేష్, 30వ వార్డుకు ఎర్రోజు స్రవంతి, 34వ వార్డుకు కొక్కుల రామ్మూర్తిలు పోటీలో ఉన్నారు.
సీపీఐ అభ్యర్థులు వీరే...
సీపీఐ పార్టీ తరపున ఐదవ వార్డు నుంచి శనిగారపు రాజేందర్, ఆరవ వార్డు నుంచి నాతరి సునీత, ఎనిమిదో వార్డు నుంచి బియ్యాల ఉపేందర్, 10వ వార్డు నుంచి గుర్రాల శారద, 23వ వార్డు నుంచి పాఠకుల సౌజన్య, 26వ వార్డు నుంచి కాసిపేట స్వర్ణలతలు పోటీ చేస్తున్నారు.