12 May, 2026 | 1:46 AM

రోడ్డెక్కిన మక్క రైతులు

12-05-2026 12:40 AM

తొర్రూరులో రాస్తారోకో 

మహబూబాబాద్, మే 11 (విజయక్రాంతి) : ధాన్యం, మక్కల కొనుగోళ్ల లో జాప్యం చేస్తున్నారని సోమవారం మహబూబాబాద్ జిల్లా తొ ర్రూరులో తొర్రూరు-మహబూబాబాద్ ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. మార్కెట్ యార్డులు, కొను గోలు కేంద్రాల్లో ధాన్యం, మక్కల కొ నుగోళ్లలో అనేక ఇబ్బందులు పడుతున్నామని, ప్రజా ప్రతినిధులు, అధికా రులు స్పందించడం లేదని ఆరోపించారు.

గన్నీ బ్యాగులు లేవని, లారీలు లేవని, మార్కెట్ యార్డులో మక్కలు తడిసి ఎండుతుంటే అధికారులు ప ట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు అదనంగా ఇస్తే ముందే కాంటాలు పెడుతున్నారని, గన్నీ బ్యాగుల పేరుతో  అక్రమ వసూ ళ్లు చేస్తున్నారం టూ మండిపడ్డారు. కొనుగోలు వేగవంతం చేయాలంటూ డిమాండ్ చేశా రు. రైతుల నిరసనతో ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడి శాంతింప చేశారు.