12 May, 2026 | 1:40 AM

వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

12-05-2026 12:41 AM

కూసుమంచి సర్పంచ్ కొండా కృష్ణవేణి మహిపాల్

అట్టహాసంగా ప్రారంభమైన సమ్మర్ క్యాంపు 

కూసుమంచి, మే 11 (విజయక్రాంతి): విద్యార్థులు వేసవి శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూసుమంచి సర్పంచ్ కొండా కృష్ణవేణి మహిపాల్ కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యాశాఖ వారోత్సవాల సందర్భంగా సోమవారం మండల కేంద్రంలోని పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వేసవి శిక్షణ శిబిరాన్ని సర్పంచ్ ప్రారంభించి మాట్లాడారు. 

విద్యార్థులు నచ్చిన అంశాలలో నైపుణ్యాలను సాధించాలన్నారు. ఈ సందర్భంగా ఎంఈవో, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాయల వీరస్వామి మాట్లాడుతూ..  ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక లో భాగంగా  విద్యా వారోత్సవాల్లో ప్రతి ఒక్కరు భాగస్వాములై ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు.  వేసవి శిక్షణ శిబిరంలో 15 రోజులపాటు క్రీడలు ,చిత్రలేఖనం, సంగీతం, నృత్యం ,యోగా, ఆరోగ్య రక్షణ ,వ్యక్తిత్వ వికాసం వంటి అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

మండలంలోని 6 నుంచి 9 తరగతి వరకు చదువుతున్న బాల,బాలికలు ఈ వేసవి శిక్షణ శిబిరాన్ని ఉపయోగించుకోవాలన్నారు. తొలిరోజు పండగ వాతావరణాన్ని తలపించింది. విద్యార్థులకు మామిడి తోరణాలతో సుందరంగా ముస్తాబు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చెన్ను వెంకటరమణ, మాజీ ఎంపీటీసీ మాదాసు ఉపేందర్ , ఉపాధ్యాయులు , సీఆర్పీలు పాల్గొన్నారు.