మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి
- ప్రజావాణిలో కలెక్టర్‌కు మాజీ మంత్రి జీవన్ రెడ్డి రైతులతో కలిసి వినతి
ఇందిరా భవన్ నుండి కలెక్టరేట్ వరకు రైతులతో కలిసి బైక్ ర్యాలీ
జగిత్యాల, మార్చి 16 ( విజయక్రాంతి ) :జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ నుండి మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి రైతులతో కలిసి ర్యాలీగా కలెక్టరేట్ కు తరలివెళ్లారు.అనంతరం రైతులతో కలిసి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రజా వాణి లో అధికారులకు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్బంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ జగిత్యాల జిల్లా లో సుమారు 50 వేల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగుచేస్తున్నారని,
వరికి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న సాగు చేస్తున్నారని,మొక్క జొన్న రైతులు వన్య ప్రాణుల బెడద, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని పంట సాగు చేస్తున్నారని అన్నారు. కొనుగోలు కేంద్ర ల ఏర్పాటు లో జాప్యంతో రైతులకు కనీస మద్దతు దర రూ.2400 దక్కడం లేదని,ఏటా ఈదురుగాలులు, వడగళ్ల వానతో మొక్కజొన్న రైతులు పంట నష్టపోతున్నారు.రాష్ట్రంలో పంటల భీమా పథకం అమలులో లేకపోవడంతోపంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వమే పరిహారం అందజేయాలని,మొక్క జొన్న రైతులు ఎకరానికి 30 వేలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తున్నారు.
పంట చేతికి వచ్చిన కొనుగోలు కేంద్రాల ఏర్పాటు పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు జాప్యంతో రైతులకు కనీస మద్దతు ధర పొందలేకపోతున్నారు.ప్రతి క్వింటాల్ పై రైతు రూ.500 చొప్పున సుమారు 30 క్వింటాళ్లకు ఎకరానికి సుమారు 15000 నష్టపోతున్నారు.ఉమ్మడి రాష్ట్రంలో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి మార్కెఫేడ్ ఆద్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.పంట సాగు చేసే సమయంలోనే పరిమితి లేకుండా రైతులకు భరోసా కల్పించేలా రైతు భరోసా పంట సాగు చేపట్టేందుకు రైతు భరోసా నిధులు విడుదల చేయాలని,
కనీస మద్దతు ధర కల్పించడంతోపాటు కోతుల బెడద నివారించేందుకు చర్యలు చేపట్టాలన్నారు.గతంలో మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలు నిర్వహించిన చోట ఉగాది పండుగ నుండి మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు.ఈ కార్యక్రమం లో అధిక సంఖ్యలో రైతులు, నాయకులు పాల్గొన్నారు.




