17 March, 2026 | 3:20 AM

లేబర్ ఆఫీస్ ఎదుట సీఐటీయూ ధర్నా

17-03-2026 12:53 AM

కరీంనగర్ క్రైం, మార్చి 16 (విజయ క్రాంతి): భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం లేబర్ ఆఫీస్ ఎదుట ధర్నా ని ర్వహించారు. అనంతరం లేబర్ ఆఫీస్ ఇంచార్జి మనోజ్ కుమార్ కు వినతి పత్రం అందచేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ బిల్డింగ్ అండ్ ఆధర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల రమేష్ మాట్లాడుతూ భవన నిర్మాణ రంగ కార్మికులకు సిఎస్సి సంస్థ హెల్త్ టెస్టులను రద్దు చేయాలని, భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు స్కీములను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చిన జీవో నెం. 12ను సవరించి, కార్మికులకు వెల్ఫేర్ బోర్డు నుండే సంక్షేమ పథకాలు అందించాలని,

కార్మికుల కార్డులు రెన్యువల్, పెండింగ్ క్లెయిమ్స్కు నిధులు వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు కదిరే రమేష్, జిల్లా కోశాధికారి వట్టి జగదీష్, జిల్లా ఉపాధ్యక్షులు జంబుకం వెంకన్న, పళ్ల తిరుపతి, మల్లారెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి రావుల ఎల్లయ్య, ఇజ్జగిరి సుధాకర్, ఇమ్మడి చక్రపాణి, నాయకులు ఎగిత రమేష్, ముడిమడుగుల మల్లేశం, పాతూరి లింగారెడ్డి, జంబుకం నరేష్, తదితరులు పాల్గొన్నారు.