మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
అలంపూర్ మార్చి 3: గద్వాల జిల్లా వ్యాప్తంగా యాసంగిలో రైతులు సాగు చేసిన మొక్కజొన్న పంటను రైతుల నుంచి నేరుగా ప్రభుత్వం కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జీకే ఈ దన్న డిమాండ్ చేశారు.
ఈ మేరకు మంగళవారం ఉండవల్లి మండలం కంచుపాడు గ్రామంలో రైతు సంఘం జిల్లా నాయకులు సింగరాజు, శేషన్ గౌడ్,రైతులతో కలిసి మా ట్లాడుతూ.. ఉండవల్లి , ఆలంపూర్,మానవపాడు మండలాలలో ప్రత్యేకించి పెద్ద మొత్తంలో మొక్కజొన్న పంట సాగు చేయడమైనదని ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో సరైన మద్దతు ధర లేకపోవడంతో రైతులు అమ్ముకునేందుకు అనేక అవస్థలు పడుతున్నారని ఈ ధర వల్ల రైతు పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రావడం లేదని ఆరు కాలం శ్రమించి చేతికి వచ్చిన పంటను అమ్ముకునేందుకు కూడా ఇబ్బంది పడవలసిన పరిస్థితి నేడు రైతుకు దాపరించిందన్నారు.తక్షణమే ప్ర భుత్వం స్పందించి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
గత డిసెంబర్ నెలలో మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన మొక్కజొన్నలకు నగదును ఇప్పటివరకు అందించలేదని దీనివల్ల రైతులు అనేక అవస్థలు పడుతున్నారని సంబంధిత అధికారులకు రైతులు విన్నవించిన పట్టించుకున్న పాపాన పోలేదని రైతు కంట కన్నీరు తీర్చేందుకు అధికారులు స్పందించి పెండింగ్ బిల్లులు రైతుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు.




