4 March, 2026 | 10:48 AM

హైకోర్టులో బాంబు కలకలం

04-03-2026 12:28 AM
  1. పేల్చేస్తామని గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఈ మెయిల్ 
  2. అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం 
  3. డాగ్, బాంబ్ స్క్వాడ్లు ముమ్మర తనిఖీలు 
  4. పరిసరాల్లో భద్రత కట్టుదిట్టం 

హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 3 (విజయక్రాంతి): రాష్ట్ర తెలంగాణ హైకోర్టులో బాంబు బెదిరింపు తీవ్ర కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఉన్నత న్యాయస్థానం పేల్చివేస్తామంటూ మంగళవారం ఈ మెయిల్ రావడంతో న్యాయస్థానం వర్గాలతో పాటు పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సమాచారం అందు కున్న వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు హుటాహుటిన కోర్టు ప్రాంగణానికి చేరుకుని పరిస్థితిని తమ అదుపులోకి తీసుకున్నాయి.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా హైకోర్టు పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుని, భద్రతను కట్టుదిట్టం చేసి ముమ్మర విచారణ చేపట్టారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్ బీడీఎస్, డాగ్ స్క్వాడ్ల సాయంతో పోలీసులు కోర్టు ప్రాంగణాన్నిఅనుమానం వచ్చిన ప్రతి వస్తువును క్షుణ్ణంగా పరిశీలిస్తూ, న్యాయమూ ర్తు ల ఛాంబర్లు, కోర్టు హాళ్లు, రిజిస్ట్రీ కార్యాలయాలు,పార్కింగ్ ఏరియాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగించారు.

ముందు జాగ్రత్త చర్యగా కోర్టు సిబ్బందిని, న్యాయవాదులను భద్రతా అధికారులు అప్రమత్తం చేశారు. తనిఖీలు  పూర్త య్యే వరకు ఎవరూ లోపలికి ప్రవేశించవద్దని  ఆదేశాలు జారీ చేశారు. ప్రాం గణంలోకి వచ్చే ప్రతి వాహనాన్ని, వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ   పరిస్థితిని సమీక్షిస్తున్నారు.ఈ బెదిరింపు మెయ్పి సీరియస్‌గా దృష్టి సారించిన ఉన్నతాధికారులు దర్యాప్తును ముమ్మ రం చేశారు. సైబర్ క్రైమ్ పోలీసుల సాయంతో ఆ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, దాన్ని పం పిన ఐపీ అడ్రస్ ఏంటి అనే కోణంలో సాంకేతిక విశ్లేషణ చేస్తున్నారు.

ఇటీవల దేశవ్యాప్తంగా పలు కీలక విద్యాసంస్థలు, విమా నాశ్ర యాలకు సైతం ఇలాంటి నకిలీ బాం బు బెదిరిం పులు వస్తున్న నేపథ్యంలో.. ఇది ఆకతాయిల పనేనా లేక ఏదైనా కుట్ర ఉందా అనే దిశగా పోలీసులు విచారిస్తున్నారు. ఇలాంటి అసత్యపు బెదిరింపులకు పాల్పడే వారిని గుర్తించి  కఠిన చర్య లు తీసుకుంటామని పోలీసు అధికారులు స్పష్టం చేశారు.