అక్కన్నపేటలో అజంతా, రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లు నిలపాలి
రైల్వే జనరల్ మేనేజర్‌ను కలిసిన ఎంపీ
రామాయంపేట, మార్చి 3 :మంగళవారం సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజ ర్ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీ రఘునందన్ రావు పార్లమెంట్ పరిధిలో కొనసాగుతున్న పలు రైల్వే అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతిపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలోని అక్కన్నపేట రైల్వే స్టేషన్ వద్ద అజంతా ఎక్స్ప్రెస్, రాయలసీమ ఎక్స్ప్రెస్ రైళ్లకు నిలుపుదల కల్పించాలని ప్రత్యేక విజ్ఞప్తి చేశారు.
అక్కన్నపేట, రామాయంపేట ప్రాంతాల ప్ర జలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ డిమా్ంప ఎంపీ ప్రత్యేక చొరవ తీసుకోవడం విశేషం. స్థానిక విద్యార్థులు, ఉద్యోగార్థులు, వ్యాపారవేత్తలు ఎదుర్కొంటున్న ప్రయాణ ఇబ్బందులను జిఎం దృష్టికి తీసుకెళ్లి, తక్షణ చర్యలు తీసుకోవాలని కోరడం ఆయన ప్రజా నిబద్ధతకు నిదర్శనం అని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు పేర్కొన్నారు.




